క్రికెట్‌లో ది బెస్ట్ ఫీట్.. అద్భుతమైన క్యాచ్ పట్టుకున్న రవీంద్ర జడేజా

  • Published By: vamsi ,Published On : September 3, 2020 / 08:01 PM IST
క్రికెట్‌లో ది బెస్ట్ ఫీట్.. అద్భుతమైన క్యాచ్ పట్టుకున్న రవీంద్ర జడేజా

క్రికెట్ మైదానంలో జరిగే కొన్ని విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి. కొన్ని విషయాలు ప్రత్యర్థి దేశాల మనస్సులలో నుంచి కూడా ఎప్పటికీ చెరిగిపోలేవు. టీమిండియా ఆల్ రౌండర్ ర‌వీంద్ర జ‌డేజా.. చేసిన ఫీట్.. పట్టుకున్న క్యాచ్ కూడా అటువంటిదే. త‌న ఫీల్డింగ్‌తో ఆకట్టుకునే జడేజా.. ఒంటిచేత్తో క్యాచ్‌లు అందుకోవ‌డంతో దిట్ట.

లేటెస్ట్‌గా గురువారం త్రోబ్యాక్ థ‌ర్స్‌డే హ్యాష్‌ట్యాగ్ పేరిట జ‌డేజా అందుకున్న అద్భుత‌మైన క్యాచ్‌ను న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ త‌న ట్విటర్‌లో షేర్ చేసింది. డీప్‌స్కేర్ లెగ్‌లో నిల్చున్న జ‌డేజా వెన‌క్కి తిరిగి ఒంటిచేత్తోఈ స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకోవడం క్రికెట్ ప్ర‌పంచ చ‌రిత్ర‌లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది మార్చి 1 న రవీంద్ర జడేజా ఈ సాటిలేని క్యాచ్ చాలా అద్భుతంగా పట్టుకున్నాడు.

క్రికెట్ న్యూజిలాండ్ తన అధికారిక ట్వీటర్ హ్యాండిల్ నుంచి రవీంద్ర జడేజా క్యాచ్‌ను # థ్రోబ్యాక్ థర్స్‌డే కింద పోస్ట్ చేసింది. కివి టెయిల్ బ్యాట్స్‌మన్ నీల్ వాగ్నర్‌కు మొహమ్మద్ షమీ షార్ట్ డెలివరీ చేసినప్పుడు, జడేజా డీప్-స్క్వేర్ లెగ్ వద్ద నిలబడి ఉన్నాడు. వాగ్నెర్ షాట్ ఆడాడు. ఆ సమయంలోనే జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టుకుని వాగ్నర్ ఇన్నింగ్స్ ముగించాడు. ఎడమ చేతితో ఉత్తమ క్యాచ్ పట్టుకోగా.. ఈ క్యాచ్ క్రికెట్ న్యూజిలాండ్ జ్ఞాపకాలలో ఒకటిగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.

ఆ మ్యాచ్‌లో కామెంటేట‌ర్‌గా ఉన్న ఇయాన్ స్మిత్‌.. ‘జ‌డేజా అందుకున్న క్యాచ్ ఔట్‌ఫీల్డ్ క్యాచ్‌స్‌లో బెస్ట్‌.. నేను చూసిన‌ వాటిలో ఇదే ది బెస్ట్.. జ‌డేజా విన్యాసం రియల్‌గా సుపర్బ్.. ‘ అంటూ కామెంట్ చేశాడు. ఈ సిరీస్ త‌ర్వాతే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభించ‌డంతో దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్ స్తంభించిపోయింది. సెప్టెంబ‌ర్ 19 నుంచి దుబాయ్ వేదిక‌గా ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 13వ సీజ‌న్‌కు ఆట‌గాళ్లు సిద్ధం అవుతున్నారు.