Government Jobs : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.

Government Jobs : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ

Government Jobs : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో బుధవారం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం పోస్టుల్లో 23,584 గ్రూప్‌-ఏ, 1,18,801 గ్రూప్‌-బీ, 8,36,936 గ్రూప్‌-సీ పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. పదవీవిరమణ, పదోన్నతి, రాజీనామా, మృతి కారణాలతో ఈ ఖాళీలు ఏర్పడినట్టు వివరించారు. కాగా, కేంద్రం చెప్పిన ఈ లెక్కలు గత ఏడాది మార్చి నాటివని, ఈ ఏడాది కాలంలో మరిన్ని ఖాళీలు పెరిగి ఉంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు.