Pakistan: మారని పాక్ వక్రబుద్ధి.. భారత్ ఆర్మీ పోస్టుపై దాడికి పాక్ ఇంటిలిజెన్స్ సంస్థ కుట్ర..

పాకిస్థాన్ వక్రబుద్ధి మారడం లేదు. తాజాగా భారత్‌ ఆర్మీ పోస్టుపై దాడికి పాక్ ఇంటిలిజెన్స్ సంస్థ కుట్ర చేయడంతో.. భారత్ ఆర్మీ దానిని తిప్పికొట్టింది.

Pakistan: మారని పాక్ వక్రబుద్ధి.. భారత్ ఆర్మీ పోస్టుపై దాడికి పాక్ ఇంటిలిజెన్స్ సంస్థ కుట్ర..

Tabarak Hussain

Pakistan: పాకిస్థాన్ వక్రబుద్ధి మారడం లేదు. తాజాగా భారత్‌ ఆర్మీ పోస్టుపై దాడికి పాక్ ఇంటిలిజెన్స్ సంస్థ కుట్ర చేయడంతో.. భారత్ ఆర్మీ దానిని తిప్పికొట్టింది. ఆగస్టు 21న కశ్మీర్ లోని నౌషారా సెక్టార్ వద్ద జంగర్ అనే ప్రదేశంలో కొందరు ఉగ్రవాదులను భారత సైన్యం గుర్తించింది. వారు కంచెను కత్తిరిస్తుండగా అప్రమత్తమై దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాదిని భారత్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే అతడ్ని పీవోకేలోని కోటిల్ జిల్లాకు చెందిన తబ్రక్ హుస్సేన్ గా గుర్తించారు.

France-UK Train breakdown in Undersea Tunnel : సముద్ర గర్భంలో ఆగిపోయిన రైలు .. ఐదు గంటలు ప్రాణాలు గుప్పిట్లో ప్రయాణీకులు

హుస్సేన్ ను విచారించగా పాకిస్థాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కర్నల్ యూనస్ చౌద్రీ అనే వ్యక్తి 30వేల పాకిస్థానీ నగదు ఇచ్చి భారత్ లో ఆత్మాహుతి దాడి చేసేందుకు పంపించినట్లు చెప్పాడు. అయితే ఆగస్టు 21 కంటే ముందు భారత్ సరిహద్దులో హుస్సేన్ రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఇదిలాఉంటే ఆగస్టు 22న లామ్ సెక్టార్ వద్ద మరో ముగ్గురు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే క్రమంలో భారత్ దళాలు మందుపాతరలు అమర్చిన ప్రదేశంలోకి వచ్చారు. దీంతో ల్యాండ్ మైన్లు పేలడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు.

తాజాగా గురువారం ఉదయం బీఎస్ఎఫ్ దళాలు అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) గుండా మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేసేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలోకి ప్రవేశించిన పాకిస్తాన్ చొరబాటుదారుడిపై కాల్పులు జరిపాయి. అతని వద్ద నుంచి ఎనిమిది కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి చిల్లియారి సరిహద్దు ఔట్‌పోస్టు సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద కదలికలను అప్రమత్తమైన దళాలు గమనించాయని అధికారి తెలిపారు. అతడి వద్ద నుంచి ఎనిమిది కిలోల మాదకద్రవ్యాలతో కూడిన ఎనిమిది ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.