కరోనా భయం : Parliament Monsoon Session నిరవధిక వాయిదా

  • Published By: madhu ,Published On : September 23, 2020 / 08:54 AM IST
కరోనా భయం : Parliament Monsoon Session నిరవధిక వాయిదా

Parliament : సమావేశాలు నిరధికంగా వాయిదా పడనున్నాయి. అక్టోబర్‌ ఫస్ట్‌ వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మరో 8 రోజుల సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల్లో కరోనా భయం నెలకొంది.



దీంతో సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు పార్లమెంట్‌ వర్గాలు తెలిపాయి. 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమై.. సాయంత్రం 5 గంటలకు నిరవధికంగా వాయిదా పడనుంది.

పార్లమెంట్‌ సమావేశాలను బుధవారం ముగించాలని నిర్ణయించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అక్టోబర్‌ 1 వరకు సమావేశాలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వాయిదా వేస్తుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నాయి. కరోనా సాకుతో ప్రజా సమస్యల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.



వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందగానే నిరవధిక వాయిదా ఎందుకు వేస్తున్నారని నిలదీశాయి. కీలక బిల్లుల ఆమోదం కోసమే పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించారా అంటూ ధ్వజమెత్తాయి.

కరోనాతో ఎంపీలు వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా…ఎంపీలకు వైరస్ సోకుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో జాగ్రత్తలు, కరోనా మార్గదర్శకాలు తీసుకుంటున్నా..రోజుకొకరు ఎంపీలు వైరస్ బారిన పడుతున్నారు.



కరోనా నేపథ్యంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు 2020, సెప్టెంబర్ 14వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం.
కానీ..ప్రస్తుతం వైరస్ ఎక్కువ మంది ఎంపీలకు సోకుతుండడంతో కేంద్రం సమావేశాలు కొనసాగింపుపై పునరాలోచించింది కేంద్రం. హోం మంత్రి అమిత్ షా, రవాణా మంత్రి గడ్కరితో పాటు మరికొంతమంది మంత్రులకు వైరస్ సోకింది. పార్లమెంట్ కు రావాలంటేనే జంకుతున్నారు.