Paytm బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్, కండీషన్స్ అప్లయ్

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ ఐపీఎల్ సీజన్ ను పురస్కరించుకుని తన యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఐపీఎల్ సీజన్ లో మొబైల్ రీఛార్జీలపై అందించనున్న క్యాష్‌బ్యాక్, ఇతర

Paytm బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్, కండీషన్స్ అప్లయ్

Paytm

Paytm : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ ఐపీఎల్ సీజన్ ను పురస్కరించుకుని తన యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఐపీఎల్ సీజన్ లో మొబైల్ రీఛార్జీలపై అందించనున్న క్యాష్‌బ్యాక్, ఇతర రివార్డులను పేటీఎం అనౌన్స్ చేసింది. ప్రతిరోజూ మొదటి వెయ్యి మంది వినియోగదారులు ఇన్నింగ్స్ విరామ సమయంలో తమ మొబైల్ ఫోన్ నంబర్లను రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్(రూ.50 వరకు) పొందుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Card tokenisation: ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్

* జియో, వీఐ, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కస్టమర్లు రూ.10 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
* కొత్త వినియోగదారులు జియో రూ.11, రూ.21, రూ.51 అదనపు డేటా ప్యాక్స్, వోడాఫోన్ ఐడియా రూ.16, రూ.48 అదనపు డేటా ప్యాక్, ఎయిర్‌టెల్ అదనపు డేటా ప్యాక్ రూ.48 రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్.
* ప్రతిరోజూ ఐపీఎల్ మ్యాచ్ జరిగే రాత్రి 7.30 నుంచి 11 గంటల మధ్య వచ్చే విరామ సమయంలో వారు చేసుకునే ప్రతి రీఛార్జీలపై 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
* అలాగే, ఇతర బహుమతి వోచర్లను కూడా రీడీమ్ చేసుకోవచ్చు.

Long Covid : ఈ 4 గ్రూపుల వారికి అత్యధిక ప్రమాదం

వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి, Paytm ఇటీవల తన మొబైల్ రీఛార్జ్ అనుభవాన్ని 3-క్లిక్ ఇన్‌స్టంట్ రీఛార్జ్‌, యూజర్ ఫ్రెండ్లీ డిస్‌ప్లేలను అందిస్తుంది. Paytm తన వినియోగదారులకు Paytm UPI, Paytm Wallet, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్ లేదా Paytm పోస్ట్‌పెయిడ్ నుండి తమ చెల్లింపు మోడ్‌ను ఎంచుకునే వెసులుబాటును ఇస్తుంది. ఇప్పుడు రీఛార్జ్ చేయడానికి, తరువాత చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. Paytm వినియోగదారులకు ఎల్లప్పుడూ కనెక్ట్ అయ్యి ఉండేలా వారి గడువు ఎక్స్ పైరీ తేదీని గుర్తు చేస్తుంది.

”మొబైల్ రీఛార్జ్‌లు Paytm లో అత్యంత ప్రజాదరణ పొందిన సేవలలో ఒకటి. క్రికెట్ సీజన్‌లో మేము మా వినియోగదారులకు ప్రత్యేక ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాము. క్యాష్‌బ్యాక్‌లో 100 శాతం వరకు ఇచ్చే ప్రత్యేక ఆఫర్‌తో యూజర్లతో సెలబ్రేట్ జరుపుకోవాలనుకుంటున్నాము” అని Paytm ప్రతినిధి చెప్పారు.

Paytm వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులు, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ & DTH రీఛార్జ్‌లు, రెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, డిజిటల్ గోల్డ్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించడం, రైలు/ఎయిర్ టికెటింగ్, క్రెడిట్ కార్డ్ బిల్లులను ఇంట్లో కూర్చునే చెల్లించవచ్చు.