India : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

India : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే

Petrol Rate

Petrol And Diesel Price : కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. ఇప్పటికే కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి.

Read More : Serial Killer : మద్యం మత్తులో సైకో ఉన్మాదం.. నగరంలో రెండు వారాల్లో 3 హత్యలు…! ​​​​​​​

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌లు పెరుగుతున్నాయి. ఇక్కడి ప్రభుత్వాలు కూడా వ్యాట్‌పై తగ్గింపు నిర్ణయం తీసుకుంటే.. ఇందన ధరలు మరింత తగ్గనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌పై 32.5 శాతం వ్యాట్‌ విధిస్తోంది. కేంద్రం బాటలో నడిచి దీన్ని సవరిస్తారా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది.

Read More : Khairatabad : సదర్ ఉత్సవాలు…దున్నపోతు వీరంగం

నగరంలో ధరలు

– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.86.67
– కోల్ కతాలో పెట్రోల్‌ రూ.104.67.. డీజిల్‌ రూ.89.79
– ముంబైలో పెట్రోల్‌ రూ.109.98.. డీజిల్‌ రూ.94.14
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.51.. డీజిల్‌ రూ.91.43

Read More : YS Jagan : ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు

– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.95.90.. డీజిల్‌ రూ.86.90
– నోయిడాలో పెట్రోల్‌ రూ.95.36.. డీజిల్‌ రూ.87.01
– బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.58.. డీజిల్‌ రూ.85.01
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.104.70.. డీజిల్‌ రూ.91.62

Read More : Singapore : అతడిని ఉరి తీయొద్దు…ఆన్ లైన్ ఉద్యమం

–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.94.23.. డీజిల్‌ రూ.80.90
– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.94.62
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.110.94.. డీజిల్‌ రూ 95.71
– విజయవాడలో రూ.110.98 డీజిల్‌ రూ.97.00