ప్లాస్టిక్ పై యుద్ధం.. వెదురు బొంగులతో వాటర్ బాటిళ్లు

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 06:51 AM IST
ప్లాస్టిక్ పై యుద్ధం.. వెదురు బొంగులతో వాటర్ బాటిళ్లు

ప్రస్తుతం పర్యావరణాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌ ఒకటి. ప్లాస్టిక్ కారణంగా ఎన్నో ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఉదయం పాల ప్యాకెట్ తో మొదలెడితే పడుకునే వరకూ ప్రతీది ప్లాస్టికే. అందుకని సిక్కిం ప్యాకేజీ తాగునీటి బాటిళ్లను పూర్తిగా నిషేధించి వెదురు కర్రలతో బాటిళ్లను ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. 

అస్సాం నుండి సిక్కిం రాజ్యసభ ఎంపి హిషే లాచుంగ్పా ద్వారా వెదురు నీటి బాటిళ్లను ఆర్డర్ చేశారు. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న దేశంలో మొట్టమొదటి రాష్ట్రం సిక్కిం. 2016లో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో, కార్యాలయాలలో ప్యాకేజీ తాగునీటి వాడకాన్ని నిషేధించింది. సాధారణ బాటిళ్లలాగే వీటినీ రెండు వారాలకొకసారి శుభ్రం చేయాల్సి ఉంటుంది. 

2006లో లాచెన్ టూరిజం డెవలప్‌మెంట్ కమిటీ (LTDC) చేసిన డ్రైవ్ లో.. ఎక్కువ శాతం టూరిస్టులే ప్లాస్టీక్ ని వాడుతున్నారని వాటిని నిషేధించాలని అనుకున్నారు. వాటర్ ప్యాకెట్లు బాన్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. 2018లో అనుకున్న విధంగానే ప్లాస్లీక్ వాటర్ ప్యాకెట్లను, కారీ బ్యాగ్ లను బాన్ చేశామని తెలిపారు. వాటర్ ప్యాకెట్ల స్థానంలో వెదురు బొంగులతో రూపొందించిన బాటిల్లను వాడుతున్నారు. ఇవి ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.