Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. 23 నుంచి 25 వరకు.. మూడ్రోజులపాటు అ్రగరాజ్యంలో పర్యటించనున్నారు భారత ప్రధాని.

Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన

Pm Modi America Tour

Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. 23 నుంచి 25 వరకు.. మూడ్రోజులపాటు అ్రగరాజ్యంలో పర్యటించనున్నారు భారత ప్రధాని. 2019 తర్వాత తొలిసారి అమెరికా వెళ్తున్న ప్రధాని మోడీ.. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటిస్తారు. బ్యాక్‌ టు బ్యాక్‌ మీటింగులతో బిజీబిజీగా గడపనున్నారాయన.

ప్రధాని మోదీ ఇవాళ వాషింగ్టన్ చేరుకుంటారు. రేపు ఉదయం అక్కడి ప్రముఖ సంస్థలకు చెందిన సీఈవోలతో సమావేశమవుతారు. ఐదుగురు టాప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌తో ముఖాముఖి సమావేశంలో పాల్గొనున్నారు ప్రధాని మోదీ. అందులో ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్ కూడా ఉండే అవకాశం ఉంది. మిగతా నలుగురు ఎవరన్నది ఇంకా ఫైనల్‌ కాలేదు. అదేరోజు అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహ్యారిస్‌తో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌, జపనీస్ ప్రధాని యోషియిడే సుగాలతో సమావేశంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ.

Also Read : RTC, Electricity Charges : కరెంట్, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం

24న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీకానున్నారు ప్రధాని మోదీ. ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక.. అదేరోజు వైట్‌హౌస్‌లో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోను మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులో అఫ్ఘానిస్తాన్ పరిణామాలు, ఇండో-పసిఫిక్‌ అజెండా, కోవిడ్‌-19, వాతావరణ మార్పులు వంటి అంశాలు చర్చకు రావచ్చు. అదేరోజు బైడెన్‌ ఇచ్చే డిన్నర్‌కు హాజరై.. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళతారు.

ఇక పర్యటనలో చివరిరోజు అయిన ఈనెల 25న.. న్యూయార్క్ లో జరిగే 76వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు మోదీ. కరోనా, ఉగ్రవాదం అంశాలను ప్రస్తావించనున్నారు. అఫ్ఘానిస్తాన్ పరిణామాలపై మనదేశ వైఖరిని అక్కడే ప్రకటించే అవకాశం ఉంది. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపైనా చర్చించే అవకాశం ఉంది. U.N.లో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి కూడా ప్రస్తావించనున్నారు ప్రధాని. ఈనెల 25తోనే అధికారిక పర్యటన ముగిసినా.. ఈనెల 27న భారత్‌కు తిరిగి రానున్నారు మోదీ.