Chandrayaan-3 Launch: నింగిలోకి చంద్రయాన్-3.. ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర ట్వీట్

భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023 ఎల్లప్పుడూ బంగారు అక్షరాలతో చెక్కబడి ఉంటుందని ప్రధాని అన్నారు.

Chandrayaan-3 Launch: నింగిలోకి చంద్రయాన్-3.. ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర ట్వీట్

Chandrayaan-3 Launch

PM Modi: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్ -3ని నింగిలోకి పంపించనున్నారు. గురువారం మధ్యాహ్నమే రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటలపాటు కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగవేదిక నుంచి చంద్రయాన్ -3తో కూడిన ఎల్‌వీఎం-3 ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన ఈ రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్ -3ని ప్రయోగిస్తారు.

Chandrayaan-3 Launch : నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైన చంద్రయాన్-3.. చంద్రయాన్-2కు చంద్రయాన్-3కి తేడా ఏమిటో తెలుసా? లక్ష్యాలు ఏమిటంటే..

మరికొద్ది గంటల్లో చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవ్వడంతో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన ట్విటర్‌లో ఇలా రాశారు. ‘చంద్రయాన్-3 మిషన్‌కు శుభాకాంక్షలు. ఈ మిషన్ గురించి అంతరిక్షం, సైన్స్, ఆవిష్కరణలలో సాధించిన పురోగతి గురించి మరింత తెలుసుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఇది మన అందరికీ చాలా గర్వంగా ఉంటుంది అని ప్రధాని అన్నారు.

Chandrayaan-3 Launch : చంద్రయాన్-3 ప్రయోగానికి నాయకత్వం వహిస్తున్న రీతు కరిధాల్ ఎవరో తెలుసా? ఆమెకు ‘రాకెట్ ఉమెన్’ అనే పేరు ఎందుకొచ్చింది..

భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023 ఎల్లప్పుడూ బంగారు అక్షరాలతో చెక్కబడి ఉంటుందని ప్రధాని అన్నారు. చంద్రయాన్ -3, మా మూడవ చంద్ర మిషన్. దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశం యొక్క ఆశలు, కలలను తీసుకువెళ్తుందని ప్రధాని తన ట్వీట్ లో పేర్కొన్నారు.