గుండెలు పిండే విషాదం.. క్యాన్సర్‌తో భార్య మృతి, ఆ వెంటనే ఐపీఎస్ అధికారి ఆత్మహత్య

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ భార్య, భర్తల అనుబంధం చూసి కంటతడి పెడుతున్నారు. బతికున్నప్పుడే కాదు మరణంలోనూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారని, వారి మధ్య ఉన్న బంధం చాలా గొప్పదని కీర్తిస్తున్నారు.

గుండెలు పిండే విషాదం.. క్యాన్సర్‌తో భార్య మృతి, ఆ వెంటనే ఐపీఎస్ అధికారి ఆత్మహత్య

Tragedy Incident In Assam (Photo Credit : Google)

Tragedy Incident : చిన్న చిన్న విషయాలకే భార్య, భర్తలు విడాకులు తీసుకుని దూరమైపోతున్న రోజులు ఇవి. అంతకు మించి తమ సుఖం కోసం భార్యను భర్త, భర్తను భార్య సుపారీ ఇచ్చి మరీ అత్యంత కిరాతకంగా చంపిస్తున్నారు. లేనిపోని అనుమానాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్యలను వేధించే భర్తలు ఉన్నారు, భర్తలను టార్చర్ పెట్టే భార్యలూ ఉన్నారు. అయితే, అందరూ ఇలానే ఉంటారు అని అనుకుంటే పొరపాటే. కొందరు దంపతుల మధ్య ఉన్న అనుబంధం, ప్రేమానురాగాలు చూస్తే కళ్లు చెమ్మగిల్లడం ఖాయం. బతికున్న సమయంలోనే కాదు మరణంలోనూ ఒకరినొకరు విడిచి ఉండలేని భార్య, భర్తలు కూడా ఉన్నారు. భార్య మరణాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయిన ఓ భర్త.. నిమిషాల వ్యవధిలోనే తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు.

ఆ భర్త.. తన భార్యను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడు. జీవితాంతం కలిసుంటానని ఆమెకు మాటిచ్చాడు. నువ్వు లేక నేను లేను అన్నట్లుగా వారి జీవితం సాగింది. వారిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందంటే.. చివరికి క్యాన్సర్ తో భార్య చనిపోతే.. తట్టుకోలేకపోయిన భర్త నిమిషాల్లోనే గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలా.. బతికున్నప్పుడే కాదు.. మరణంలోనూ భార్య వెంటే నడిచాడా భర్త. గుండెలు పిండే ఈ విషాద ఘటన అస్సాంలో జరిగింది.

క్యాన్సర్ బారిన భార్య చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో ఆమె భర్త, ఐపీఎస్ అధికారి అయిన శిలాదిత్య చెటియా ఆత్మహత్య చేసుకున్నారు. భార్య చనిపోయిన నిమిషాల వ్యవధిలోనే ఆయన తుపాకీతో కాల్చుకున్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా… ఆలోపే ఆయన మరణించారు. శిలాదిత్య సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. అస్సాం ప్రభుత్వంలో హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్ మెంట్ సెక్రటరీగా ఉన్నారు. 2009 బ్యాచ్ కు చెందిన ఆయన పలు జిల్లాలకు ఎస్పీగా పని చేశారు.

శిలాదిత్య భార్య చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్నా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. చివరికి ఆమె కన్నుమూశారు. భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమెను చూసుకునేందుకు.. శిలాదిత్య 4 నెలలుగా లీవ్ లో ఉన్నారని ఉన్నతాధికారులు తెలిపారు. ఆయనకు భార్య అంటే ఎంతో ప్రాణం అని బంధువులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ కలిసి జీవించారని, ఇప్పుడు భార్య లేకపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని, ఈ క్రమంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నారని కన్నీటిపర్యంతం అయ్యారు.

Also Read : క్రైమ్ థిల్లర్‌ను తలపించేలా.. కట్టుకున్న భర్తను చంపించిన భార్య.. ట్విస్టులు మామూలుగా లేవు!

భార్య ఇక లేదు అని తెలిసి శిలాదిత్య తల్లిడిల్లిపోయారు. నువ్వు లేక నేను లేను అంటూ.. భార్య మరణించిన నిమిషాల వ్యవధిలోనే తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ భార్య, భర్తల అనుబంధం చూసి కంటతడి పెడుతున్నారు. బతికున్నప్పుడే కాదు మరణంలోనూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారని, వారి మధ్య ఉన్న బంధం చాలా గొప్పదని కీర్తిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే భార్య, భర్తలు విడాకులు తీసుకుని దూరమైపోతున్న ఈరోజుల్లో.. ఈ దంపతుల అనుబంధం కనువిప్పు కలిగించాలని కోరుకుంటున్నారు.