NIA Raids on PFI: పీఎఫ్ఐ సంస్థ సభ్యులపై కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు.. ఒక్క రోజే 200 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిపిన దాడుల్లో దాదాపు 200 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.

NIA Raids on PFI: పీఎఫ్ఐ సంస్థ సభ్యులపై కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు.. ఒక్క రోజే 200 మంది అరెస్ట్

NIA Raids on PFI: దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సంస్థపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఈడీ, ఎన్ఐఏ కలిపి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో ఏక కాలంలో ఎనిమిది రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు.

Drones In Power Transmission: విద్యుత్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లు.. తొలిసారిగా వినియోగిస్తున్న మధ్యప్రదేశ్

పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఒక్కరోజే 200 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్, మధ్య ప్రదేశ్, అసోం, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దాడులు జరుగతున్నాయి. ఈ దాడుల్లో కర్ణాటకలో 60 మందిని, ఢిల్లీలో 30 మందిని, మధ్య ప్రదేశ్‌లో 21 మంది పీఎఫ్ఐ కార్యకర్తల్ని అరెస్టు చేశారు. థానె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ముంబ్రలో ఇద్దరిని, కళ్యాణ్‌లో ఒకరు, భీవండిలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల దాడులకు పాల్పడేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసినట్లు తాజాగా తేలింది.

Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్‌సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!

బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే లక్ష్యంగా ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు తెలిసింది. మహారాష్ట్ర పోలీసులు జరిపిన విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే నాగ్‌పూర్ పట్టణంలో రెక్కీ కూడా నిర్వహించారు. పీఎఫ్ఐ హిట్ లిస్టులో దర్యాప్తు సంస్థల అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో అధికారులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల్ని అప్రమత్తం చేశారు.