PM Modi : గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై బ్రిడ్జి కూలిన ఘటనలో 137మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా విచారకమైనదనీ..మతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ట్విట్టర్ ద్వారా వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

PM Modi : గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

Gujarat Bridge Collapses pm Modi

Updated On : October 31, 2022 / 3:48 PM IST

Gujarat Bridge Collapses pm Modi : గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై బ్రిడ్జి కూలిన ఘటనలో 137మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా విచారకమైనదనీ..మతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ట్విట్టర్ ద్వారా వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యల్ని కొనసాగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.

కాగా..ఆదివారం (అక్టోబర్ 30,2022) సాయంత్రం మచ్చు నదిపై బ్రిటిష్ కాలంనాటి వంతెన మరమ్మతులు చేసిన వారంరోజులకే కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో ఛత్ పూజకు సంబంధించి కొన్ని ఆచారాలు నిర్వహించడానికి ప్రజలు భారీగా గుమ్మికూడారు. ప్రమాద సమయంలో సుమారు 500 మంది బ్రిడ్జిపై ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రాణాలతో బయటపడగా సోమవారం తెల్లవారుజాము వరకు ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం 137 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన ఐదు బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అర్థరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగగా, వెలుతురు లేకపోవడంతో కొంత ఆటంకం ఏర్పడింది. సోమవారం తెల్లవారు జామునుంచి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

మోర్బిలోని కేబుల్ బ్రిడ్జి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఏడు నెలల పాటు దానిని మూసివేసి ఉంచారు. మరమ్మతుల అనంతరం గుజరాతీ నూతన సంవత్సరమైన అక్టోబర్ 26న ప్రజలకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ బ్రిడ్జిని ప్రారంభించినందుకు కంపెనీకి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయబడిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వంతెన మరమ్మతు పనులకోసం కంపెనీ ఏ రకమైన మెటీరియల్‌ను ఉపయోగించిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే వంతెన మరమ్మతులు చేపట్టిన కంపెనీపై ఐపీసీ సెక్షన్ 304, 308 మరియు 114 కింద కేసులు నమోదు చేసినట్లు గుజరాత్ హోం మంత్రి తెలిపారు.