India In UN: ముందు మీ దేశాన్ని బాగు చేసుకోండి.. పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఐక్యరాజ్యసమితి వేదికగా బుధవారం పాకిస్తాన్‌కు భారత్ గట్టి జవాబిచ్చింది. భారత్‌లోని జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస భద్రతా మండలిలో పాక్ ఆరోపించింది. జమ్ము-కాశ్మీర్‌ను భారత్ ఆక్రమించుకుందని చెప్పింది. అయితే, పాక్ వ్యాఖ్యల్ని భారత్ కొట్టిపారేసింది.

India In UN: భారత్‌లో హక్కుల గురించి విమర్శించే బదులు పాకిస్తాన్ ముందు తన దేశాన్ని సరిదిద్దుకోవాలని హెచ్చరించింది భారత్. ఐక్యరాజ్యసమితి వేదికగా బుధవారం పాకిస్తాన్‌కు భారత్ గట్టి జవాబిచ్చింది. భారత్‌లోని జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస భద్రతా మండలిలో పాక్ ఆరోపించింది.
జమ్ము-కాశ్మీర్‌ను భారత్ ఆక్రమించుకుందని చెప్పింది. అయితే, పాక్ వ్యాఖ్యల్ని భారత్ కొట్టిపారేసింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. పాక్ వ్యాఖ్యలపై స్పందించడం కూడా దండగే అని చెప్పారు. ఇదే అంశంపై ఐరాసలో భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి జగ్ప్రీత్ కౌర్ ఘాటుగా స్పందించారు. పాక్ వైఖరిపై మండిపడ్డారు. ‘‘ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే ముందు పాకిస్తాన్ తన దేశాన్ని చక్కదిద్దుకోవాలి. సొంత దేశ ప్రజల హక్కులకు రక్షణ కల్పించాలి. అభివృద్ధిపై దృష్టి సారించాలి. తమ దేశంలో మానవ హక్కులు గొప్పగా ఉన్నట్లు పాక్ చెప్పుకొంటుంది.
MLC Kavitha Letter ED : ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. మార్చి11న విచారణకు హాజరవుతా
కానీ, గతంలో ఆ దేశ నేతలే తీవ్రవాద గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నట్లు బహిరంగంగా అంగీకరించారు. తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఇండియా, అఫ్ఘనిస్తాన్‌లోకి పంపుతారు. తమ దేశంలో దైవదూషణలు చేశారంటూ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తువులు అందరికీ కఠిన శిక్షలు విధిస్తారు. మరణశిక్షలు కూడా ఉంటాయి. అలాంటి పాకిస్తాన్.. ప్రపంచానికి ఏది మంచి.. ఏది చెడు అనేది చెబుతుంది. లదాఖ్, జమ్ము-కాశ్మీర్ అన్నీ భారత్‌లో అంతర్భాగమే’’ అని జగ్ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించారు.