IND VS AUS 4th Test Match: ఇండియా, ఆస్ట్రేలియా నాల్గో టెస్ట్ మ్యాచ్.. తొలి రోజు ఆస్ట్రేలియా స్కోరు 255/4.. ఖవాజా సెంచరీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ విజేతగా నిలవడంతోపాటు, డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. 

IND VS AUS 4th Test Match: ఇండియా, ఆస్ట్రేలియా నాల్గో టెస్ట్ మ్యాచ్.. తొలి రోజు ఆస్ట్రేలియా స్కోరు 255/4.. ఖవాజా సెంచరీ

IND-vs-AUS-4th-Test-Match

IND VS AUS 4th Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య  నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. తొలి రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా స్కోరు 255/4 (90 ఓవర్లకు)గా ఉంది. ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ బాదాడు.

ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా.. మిగతా బ్యాటర్లందరూ విఫలమవుతున్నప్పటికీ క్రీజులో నిలదొక్కుకుని చక్కటి షాట్లు ఆడాడు. 14 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా 104, కామెరాన్ గ్రీన్ 49 పరుగులతో ఉన్నారు. తొలి రెండు టెస్టు మ్యాచుల్లో భారత్, మూడో మ్యాచులో ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. దీంతో, నాలుగు టెస్టు మ్యాచుల ఈ సిరీస్ లో 2-1తో టీమిండియా ముందంజలో ఉంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 09 Mar 2023 05:05 PM (IST)

    తొలి రోజు ఆస్ట్రేలియా స్కోరు 255/4

    తొలి రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా స్కోరు 255/4 (90 ఓవర్లకు)గా ఉంది.

  • 09 Mar 2023 04:35 PM (IST)

    సెంచరీ బాదిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా

    ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ బాదాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా.. మిగతా బ్యాటర్లందరూ విఫలమవుతున్నప్పటికీ క్రీజులో నిలదొక్కుకుని చక్కటి షాట్లు ఆడాడు. 14 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా 104, కామెరాన్ గ్రీన్ 49 పరుగులతో ఉన్నారు.

  • 09 Mar 2023 03:18 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. 70.4 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా స్కోరు 170 ఉన్న సమయంలో షమీ బౌలింగ్ లో పీటర్ హ్యాండ్‌కోంబ్ ఔట్ అయ్యాడు. అతడు 27 బంతుల్లో 17 పరుగులు చేశాడు.

  • 09 Mar 2023 02:58 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 151 పరుగుల వద్ద కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఔటయ్యాడు. 135 బంతుల్లో 38 పరుగులు చేసిన స్మిత్.. జడేజా బౌలింగ్‌లో బోల్డయ్యాడు. స్మిత్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు ఉన్నాయి. స్మిత్ అనంతరం పీటర్ హ్యాండ్స్‌కోంబ్ బ్యాటింగ్‌కు దిగాడు. ప్రస్తుతం క్రీజులో పీటర్, ఉస్మాన్ ఖవాజా ఉన్నారు. ఆస్ట్రేలియా తాజా స్కోరు 155/3 (67)

  • 09 Mar 2023 01:29 PM (IST)

    ఆఫ్ సెంచరీ చేసిన ఖవాజా ..

    ఆస్ట్రేలియా ఓపెనర్ ఖవాజా (56) ఆఫ్ సెంచరీ చేశాడు. భారత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నాడు. 147 బాల్స్ ఎదుర్కొన్న ఖవాజా 56 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. 49 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్  స్కోర్ 128/2 కి చేరింది. క్రీజులో ఖవాజాతో పాటు స్టీవ్ స్మిత్ (26) ఉన్నాడు.

  • 09 Mar 2023 01:05 PM (IST)

    100 దాటిన ఆసీస్ స్కోర్ ..

    ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకుంటున్నారు. ఓపెనర్ ఖవాజా, స్టీవ్‌స్మిత్ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఖవాజా (48) ఆఫ్ సెంచరీకి చేరువ కాగా, స్మిత్ (14) క్రీజులో ఉన్నాడు. 44 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ స్కోర్ 108/2.

  • 09 Mar 2023 11:42 AM (IST)

    లంచ్ బ్రేక్..

    నాల్గో టెస్టు తొలి రోజు ఆటకు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. హెడ్, లబుషేన్ ఔట్ కాగా.. ఖవాజా (27), స్టీవ్ స్మిత్ (2) క్రీజులో ఉన్నారు.

  • 09 Mar 2023 11:13 AM (IST)

    ఆసీస్ రెండో వికెట్ డౌన్.. లబుషేన్ ఔట్..

    ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ వేసిన 22.3 ఓవర్లో లబుషేన్ (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 72 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఖవాజా (26), ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (1) ఉన్నారు.

     

  • 09 Mar 2023 11:01 AM (IST)

    21ఓవర్లకు 72 పరుగులు ..

    ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 21 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ స్కోర్ 72/1 కి చేరింది. ఖవాజా (26), లబుషేన్ (3) క్రీజులో ఉన్నారు. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ వేస్తున్నారు.

  • 09 Mar 2023 10:47 AM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. ట్రావిస్ హెడ్ ఔట్

    ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. రవిచంద్ర అశ్విన్ వేసవిన 15.3 ఓవర్లో ట్రావిస్ హెడ్ (32) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా (18), లబుషేన్ (1) ఉన్నారు. 16 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 62/1

  • 09 Mar 2023 10:26 AM (IST)

    నిలకడగా ఆడుతున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ..

    ఆసీస్ ఓపెనర్లు ఖవాజా (10), హెడ్ (23) నిలకడగా ఆడుతున్నారు. వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతున్నారు. దీంతో ఆసీస్ స్కోర్ 12 ఓవర్లకు 44/0 కు చేరింది. ఉమేష్ యాదవ్ వేసిన 6వ ఓవర్లో ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ శ్రీకర్ భరత్ నేలపాలు చేశాడు.

  • 09 Mar 2023 10:05 AM (IST)

    ఏడు ఓవర్లకు ఆసీస్ స్కోర్ 24/0

    ఆసీస్ స్కోర్ ఏడు ఓవర్లకు 24/0 కు చేరింది. ఖవాజా (6), హెడ్ (7) క్రీజులో ఉన్నారు.

  • 09 Mar 2023 10:03 AM (IST)

    స్టేడియంలో ప్రత్యేక వాహనంపై తిరుగుతూ అభివాదం ..

  • 09 Mar 2023 10:00 AM (IST)

    క్రీడాకారులను పరిచయం చేసుకున్న ప్రధానులు ..

     

  • 09 Mar 2023 09:42 AM (IST)

    రెండు ఓవర్లకు ఆసీస్ స్కోర్ 10/0

    ఆసీస్ స్కోర్ రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి 10/0కి చేరింది. ఖవాజా (4), ట్రావిస్ హెడ్ (0) పరుగులు చేశారు. తొలి ఓవర్లో ఆరు రన్స్ బైస్ రూపంలో వచ్చాయి. ఉమేష్ యాదవ్ వేసిన రెండో ఓవర్ మేడియన్ అయింది.

  • 09 Mar 2023 09:33 AM (IST)

    ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభమైంది. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా క్రీజ్ లోకి వచ్చారు. మొదటి ఓవర్ ను టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ ఆరంభించారు. మూడో టెస్టు‌కు దూరమైన షమీ.. తిరిగి నాల్గో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్న విషయం విధితమే.

  • 09 Mar 2023 09:17 AM (IST)

    భారత్ జట్టులో ఒక్క మార్పు..

    తుది జట్టులో టీమిండియా ఒక్క మార్పు చేసింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో  సిరాజుద్దీన్ స్థానంలో మహ్మద్ షమీ తుదిజట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

    టీమిండియా జట్టు..

    రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్); రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్.

    ఆస్ట్రేలియా జట్టు .. 

    ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), పీటర్ హ్యాండ్‌స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్

     

  • 09 Mar 2023 09:13 AM (IST)

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..

    ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • 09 Mar 2023 09:06 AM (IST)

    క్యాప్‌లు అందుకున్న కెప్టెన్లు ..

    భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి టెస్ట్ మ్యాచ్ కోసం తన క్యాప్‌ను అందుకున్నారు. అదేవిధంగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నుంచి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్యాప్‌ను అందుకున్నారు.

  • 09 Mar 2023 08:56 AM (IST)

    స్టేడియంకు చేరుకున్న ప్రధానులు ..

    భారత్ - ఆస్ట్రేలియా నాల్గో టెస్టు‌ను వీక్షించేందుకు  ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్టేడియంకు చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధానిని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సన్మానించగా, ప్రధాని నరేంద్ర మోదీని బీసీసీఐ సెక్రటరీ జే షా సన్మానించారు.

  • 09 Mar 2023 08:52 AM (IST)

    ఇరు జట్లకు కీలక మ్యాచ్ ..

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఇండియా, ఆస్ట్రేలియా నాల్గో టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ను కైవసం చేసుకోవటంతో పాటు, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నేరుగా చేరుతుంది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్ ఓటమి నుంచి బయటపడి డ్రా చేసుకోవచ్చు.

  • 09 Mar 2023 08:29 AM (IST)

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మరికొద్దిసేపట్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి స్టేడియంకు రానున్నారు. మ్యాచ్‌కు గంట ముందుగానే ఇరువురు ప్రధానులు స్టేడియంకు చేరుకుంటారు. టాస్‌వేసే సమయంలో ప్రధానులిద్దరూ స్టేడియంలో ఉంటారని సమాచారం. ప్రధాని మోదీ టాస్ వేయనున్నట్లు తెలుస్తోంది.