Rakesh Jhunjhunwala: రూ.5వేలతో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి 40వేల కోట్ల సంపద సృష్టించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా (62) ఆదివారం కన్నుమూశారు. రాకేష్ వ్యాపారి, చార్టర్డ్ అకౌంటెంట్. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు.

Rakesh Jhunjhunwala: రూ.5వేలతో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి 40వేల కోట్ల సంపద సృష్టించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

Rakesh Jhunjhunwala

Rakesh Jhunjhunwala: ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా (62) ఆదివారం కన్నుమూశారు. రాకేష్ వ్యాపారి, చార్టర్డ్ అకౌంటెంట్. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఝున్‌ఝున్‌వాలాను తరచుగా భారతదేశపు వారెన్ బఫెట్ అని పిలుస్తారు. రాకేష్ 5 జూలై 1960న హైదరాబాద్‌లో జన్మించారు. అతను రాజస్థానీ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని తండ్రి ఆదాయపు పన్ను కమిషనర్ గా ముంబైలో పనిచేశారు. తండ్రి ఉద్యోగ రిత్యా ముంబైలో ఉండటంతో రాకేష్ ముంబైలోనే పెరిగారు. ఈ క్రమంలో 12ఏళ్ల నుంచే స్టాక్ మార్కెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు. స్టాక్ మార్కెట్ వార్తల్ని, షేర్లనీ గమనిస్తూ పెరిగాడు. 17ఏళ్లకే మార్కెట్‌లో ఇన్వెస్ట్ మెంట్ చేశారు. సిడెన్‌హామ్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాక, తండ్రి సూచన మేరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరాడు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అయిన రేఖా ఝున్ ఝున్ వాలాను వివాహం చేసుకున్నాడు.

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 1985లో తొలిసారి స్టాక్ మార్కెట్ లో రూ. 5వేల పెట్టుబడి పెట్టాడు. అప్పటి నుంచి 35ఏళ్లలో రూ. 40వేల కోట్ల సంపద సృష్టించాడు. భారత దేశంలో 36వ అత్యంత సంపన్న వ్యక్తిగా రాకేష్ నిలిచాడు. ఆయన పట్టుకున్న షేర్లన్నీ బంగారమే అన్నముద్ర ఉంది. సరైన షేర్లను గుర్తించడంలో రాకేష్ కు సాటిలేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన కంపెనీ పేరు రేర్ ఎంటర్ ప్రైజెస్. రాకేష్ పేరు, భార్య రేఖ పేరు కలిసొచ్చేలా రేర్ ఎంటర్ ప్రైజెస్ గా నామకరణం చేశారు. రాకేష్ ఝున్ ఝున్ వాలాకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Viral Video: నువ్వొస్తానంటే.. నే రానిస్తానా! ఆకట్టుకుంటున్న కప్పల ఫన్నీ వీడియో

రాకేష్ “బిగ్ బుల్ ఆఫ్ ఇండియా”, “కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్” అని ప్రసిద్ది చెందారు. పెట్టుబడిదారు మాత్రమే కాదు.. ఆయన ఆప్‌టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు.  ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బిల్‌కేర్ లిమిటెడ్, ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోవోగ్ ఇండియా లిమిటెడ్, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్, ఇన్నోవాసింత్ టెక్నాలజీస్ లిమిటెడ్, మిడ్ డే మల్టీమీడియా లిమిటెడ్, నాగార్జున కాన్‌స్టరుక్షన్ లిమిటెడ్, విసెర్చ్‌లో వంటి అనేక సంస్థలలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మాజీ జెట్ ఎయిర్‌వేస్ CEO వినయ్ దూబే కలిసి రాకేష్ ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థను స్థాపించారు. విమానయాన రంగం పరిస్థితి బాగాలేని సమయంలో ఎయిర్ లైన్స్ సంస్థను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించినప్పుడు.. నేను వైఫల్యానికి సిద్ధంగా ఉన్నాను అంటూ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా బదులిచ్చాడు.