Diamond Rakhis : సూరత్ లో వజ్రాల రాఖీలు..ధర ఎంతో తెలుసా..?

వజ్రాల వ్యాపారాలకు పేరొందిని సూరత్ లో ఈ రాఖీ పండుగకు వజ్రాల రాఖీలు సందడి చేస్తున్నాయి. వజ్రాల వ్యాపారులు వజ్రాల రాఖీలు తయారు చేసి మార్కెట్ ని మరింత మెరుపులు మెరిపిస్తున్నారు.

Diamond Rakhis : సూరత్ లో వజ్రాల రాఖీలు..ధర ఎంతో తెలుసా..?

Diamond Rakhis : ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 11న దేశ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. రంగు రంగుల రాఖీల డిజైన్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకొనే రాఖీ సోదర ప్రేమకి సంకేతంగా విరాజిల్లుతోంది. సోదరుని చేతికి రాఖీ కట్టి చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. సోదరుల సంరక్షణ, క్షేమం కోరుతూ అక్కా, చెల్లి వారి చేతికి రాఖీ కడుతారు. ఎలాంటి కష్టమొచ్చినా తోడుంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. సోదరి సంతోషపడేలా బహుమతులు ఇస్తుంటారు.

మార్కెట్లో వివిధ రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. రాఖీ పండుగ అంతకంతకూ తోబుట్టువల మధ్య ప్రేమే కాదు..మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తోంది. ఫ్యాషన్ రాఖీలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. రక రకాల డిజైన్లు మార్కెట్ కళ్లు జిగేల్ మనిపిస్తున్నాయి. సోదరీమణులు వారి వారి స్థాయిలకు తగినట్లుగా రాఖీలు కొని వారి సోదరులకు కడుతుంటారు. వెండి బంగారం రాఖీలే కాదు వజ్రాల రాఖీలు కూడా సోదరీమణులను ఆకట్టుకుంటున్నాయి.

రాఖీల పండుగ క్రేజ్ ను వ్యాపారస్తులు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. మారుతున్న కాలానికి తగినట్లుగా వ్యాపారులు రాఖీలను తయారు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పండుగకు ముందు సూరత్ లో వజ్రాల రాఖీలను విక్రయిస్తున్నారు. పర్యావరణకు అనుకూలమైన రాఖీలను తయారు చేస్తున్నట్లు ఓ వ్యాపారి వెల్లడించారు. రీ సైకిల్ చేసుకొనే విధంగా బంగారంతో తయారు చేశామన్నారు. డైమండ్ ను కూడా ఉపయోగించడం జరిగిందన్నారు. దీని ధర దాదాపు రూ. 3 వేల నుంచి రూ. 8 వేల వరకు ఉంటుందని వ్యాపార వేత్త రజనీకాంత్ తెలిపారు.

కాగా..సందర్భం ఏదన్నాగానీ..సూరత్ వ్యాపారులు ఆ ట్రెండ్ ను ఇట్టే ఫాలో అయిపోతుంటారు. గతంలో కోవిడ్ సమయంలో కూడా వజ్రాల మాస్కులు తయారు చేసి వార్తల్లో నిలిచారు. ఈక్రమంలో రాఖీ పండుగ సందర్భంగా సూరత్ లోని వజ్రాల వ్యాపారులు వజ్రాల రాఖీలతో సందడి చేసున్నారు. వజ్రాల వ్యాపారాలకు పేరొందిన సూరత్ లో వజ్రాల రాఖీలు తయారు చేసి మార్కెట్ ని మరింత మెరుపులు మెరిపిస్తున్నారు.