‘Ram Setu’stone : నదిలో తేలుతున్న ‘రామ్’అనే అక్షరాలున్న పెద్ద ‘రాయి’

ఉత్తరప్రదేశ్‌లోని ఇసాన్ నది నీటిపై తేలియాడుతున్న ఓ రాయి వైరల్ అవుతోంది. ఆ రాయిపై హిందీలో ‘రామ్‌’ అని రాసి ఉండటం మరో విశేషం. దీంతో ఆ రాయు కచ్చితంగా శ్రీరాముడు నిర్మించిన వారది ‘రామసేతులోని రాయి’ అని అంటున్నారు స్థానికులు.

‘Ram Setu’stone : నదిలో తేలుతున్న ‘రామ్’అనే అక్షరాలున్న పెద్ద ‘రాయి’

‘floating’ stone in UP’s Mainpuri river : ఉత్తరప్రదేశ్‌లోని ఇసాన్ నది నీటిపై తేలియాడుతున్న ఓ రాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రాయి ‘రామసేతు’రాయి అని అంటున్నారు స్థానికులు. యూపీలోని మైన్‌పురీ జిల్లాలో ఉన్న ఇసాన్‌ నదిలో ఓ పెద్ద రాయి నీటిపై తేలుతోంది. ఆ రాయిపై హిందీలో ‘రామ్‌’ అని రాసి ఉండటం మరో విశేషం. దీంతో ఆ రాయు కచ్చితంగా శ్రీరాముడు నిర్మించిన వారది ‘రామసేతులోని రాయి’ అని అంటున్నారు స్థానికులు.

జూలై 30 (2022)న చేపల వేటకు వెళ్లిన చిన్నారులకు ‘రామ్’అని హిందీలో రాసి ఉన్న ఈ రాయి దొరికింది. రాయి 5.7 కిలోల బరువున్నప్పటికీ నీటిలో తేలియాడుతుండటం అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో ఆరాయి కచ్చితంగా రామసేతు రాయి అని ప్రగాఢంగా నమ్ముతున్నారు స్థానికులు.

మైన్‌పురీ జిల్లా తానా బెవార్‌ ఏరియాలోని అహిమల్‌పూర్‌లో ఈ వీడియో తీశారు. శ్రీ లంకను చేరడానికి నీటిపై తేలియాడే రాళ్లతో రాముడు వానరసేన సహాయంతో రామసేతును నిర్మించినట్టు హిందువులు నమ్ముతుంటారు.ఈక్రమంలో నది నీటిలో తేలియాడుతు లభించిన రాయి ఆ రామసేతుది అయి ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఆరాయికి పూజలు చేస్తున్నారు.