RBI Hikes Repo Rate: రుణగ్రహీతలకు షాక్.. మరోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ..

పెరుగుతున్న ద్రవ్వోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటు‌ను మరో 0.50 శాతం పెంచడంతో 5.90శాతానికి చేరింది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీరేట్లను 0.50శాతంకు పెంచుతున్నట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.

RBI Hikes Repo Rate: రుణగ్రహీతలకు షాక్.. మరోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ..

RBI Governor Shaktikanta Das

RBI Hikes Repo Rate: పెరుగుతున్న ద్రవ్వోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటు‌ను మరో 0.50 శాతం పెంచడంతో 5.90శాతానికి చేరింది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీరేట్లను 0.50శాతంకు పెంచుతున్నట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ వడ్డీ రేట్లను ఆర్బీఐ మే నెల నుంచి పెంచుతూ వచ్చింది. మే నెలలో 0.40శాతం, జూన్, ఆగస్టులో 0.50శాతం చొప్పున, తాజాగా 0.50 శాతం పెంచడంతో నాలుగు నెలల వ్యవధిలోనే రెపో రేటు 1.90శాతం పెరిగింది. తాజాగా మరోసారి ఆర్బీఐ రేపో రేటు పెంచడంతో బ్యాంకులు రుణ గ్రస్తులకు అందించే రుణాల వడ్డీరేట్లను పెంచనున్నాయి.

Congress President Election-2022: ఖర్గే ఇంటికి దిగ్విజయ్ సింగ్.. స్పందించిన శశి థరూర్

తాజాగా ఆర్బీఐ నిర్ణయంతో.. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఇలా బ్యాంకు నుంచి తీసుకున్న లోన్లపై నెలవారీ చెల్లించే ఈఎంఐ మరింత పెరగనుంది. మరోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి రోజురోజుకు పతనమవుతోంది. ఎన్నడూలేనంతగా డాలర్ విలువ ఇటీవల రూ.81.94కి చేరింది. దీంతో వడ్డీ రేటును నిర్ణయించేందుకు ఆర్బీఐ దీన్నికూడా ప్రతిపాదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ఇప్పటికే కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ లోని ఉద్రిక్తల వంటి రెండు అతిపెద్ద కుదుపులను ఎదుర్కొన్నామని, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాల వల్ల తలెత్తే ఉత్పాతం మధ్యలో ఉన్నామని అన్నారు. అమెరికా డాలర్ గరిష్టాలకు చేరిందని, ఆహార, ఇంధన ధరలు పెరిగాయని, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక విధానాల పర్యవసానాలు ప్రభావాన్ని చవిచూస్తున్నామని తెలిపారు. ప్రపంచ దేశాల వృద్ధి మందగించిందని, ఇవన్నీ వర్ధమాన దేశాలకు ఓ సవాల్ గా నిలుస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాసు అన్నారు.