Charanjit Singh Channi : కొత్త సీఎంకి మీటూ ఆరోపణల సెగ… రాజీనామా చేయాలని డిమాండ్

పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించి గంటలు కూడా గడవలేదు. అప్పుడే చిక్కుల్లో పడ్డారు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ. సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌పై మీటూ ఆరోపణలన్న నేపథ్యంలో ఆయన తన పదవికి వెంటనే రా

Charanjit Singh Channi : కొత్త సీఎంకి మీటూ ఆరోపణల సెగ… రాజీనామా చేయాలని డిమాండ్

Charanjit Singh Channi

Charanjit Singh Channi : పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించి గంటలు కూడా గడవలేదు. అప్పుడే చిక్కుల్లో పడ్డారు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ. సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌పై మీటూ ఆరోపణలన్న నేపథ్యంలో ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ డిమాండ్‌ చేసింది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎంగా నియమితులవ్వడం సిగ్గుచేటంది.

‘పంజాబ్‌ సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ నియామకం సిగ్గుచేటు, తీవ్ర అభ్యంతరకరం. ఓ ఐఏఎస్‌ అధికారిణికి అసభ్యకర మెసేజ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి వేధింపులు మరో మహిళకు జరగకూడదని కోరుకుంటున్నాం. తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ డిమాండ్‌ చేశారు.

SBI Warning : ఆ నంబర్లతో జాగ్రత్త.. ఖాతాదారులకు SBI హెచ్చరిక

ఓ మహిళా ఐఏఎస్‌ అధికారికే న్యాయం జరగకుంటే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఉన్నతాధికారులకే వేధింపులు ఎదురైతే.. సాధారణ మహిళలకు రక్షణ కల్పిస్తామని కాంగ్రెస్‌ ఎలా భరోసా ఇవ్వగలదని ప్రశ్నించారు. పార్టీ అధినేతకు చరణ్‌జిత్‌పై మీటూ ఆరోపణలు కనిపించలేదా అని జాతీయ మహిళా కమిషన్‌ చీఫ్‌ రేఖా శర్మ నిలదీశారు.

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

”పంజాబ్‌ కొత్త సీఎం చరణ్‌జీత్‌ సింగ్ చన్నీ వల్ల మహిళల భద్రతకు ముప్పు ఉంది. 2018లో ‘మీ టూ’ ఉద్యమం సమయంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుంది. ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ నాడు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ధర్నా చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈరోజు ఒక మహిళ నేతృత్వంలోని పార్టీ ద్వారా చన్నీ పంజాబ్ సీఎం అయ్యారు. ఇది ద్రోహం. ఆయన వల్ల మహిళల భద్రతకు ముప్పు ఉంది. చన్నీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలి. ఆయన ముఖ్యమంత్రి కావడానికి అనర్హుడు. చన్నీని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కోరుతున్నా” అని జాతీయ మహిళా కమిషన్ (NCW) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ అన్నారు.

2018లో మహిళా ఐఏఎస్‌ అధికారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టారంటూ చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆ అంశం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, అప్పటి సీఎం అమరీందర్‌ సింగ్‌ జోక్యంతో వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు. ఆ ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా వెల్లడించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలపాలంటూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శికి లేఖ రాసినట్లు పంజాబ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మనీషా గులాటి తెలిపారు. తాజాగా చరణ్ జిత్ సింగ్ సీఎం కావడంతో మరోసారి మీటూ ఆరోపణల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇప్పుడీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సీఎం చరణ్ జిత్ సింగ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే ఆసక్తి నెలకొంది.