NIRDPR Recruitment : ఎన్ ఐఆర్ డీపీఆర్ లో ఖాళీల భర్తీ

ఈ పోస్టుకు కామర్స్, కంప్యూటర్ డిగ్రీ అర్హత గా నిర్ణయించారు. ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ లో మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 40 ఏళ్లకు మించకూడదు.

NIRDPR Recruitment  : ఎన్ ఐఆర్ డీపీఆర్ లో ఖాళీల భర్తీ

Nirdpr Hyderabad

NIRDPR Recruitment  : భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ లో ఒబ్బంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి…

ఉమెన్ అండ్ ఛైల్డ్ డెవలప్ మెంట్ కో ఆర్టినేటర్ ; దీనికి సంబంధించి సోషల్ సైన్సెస్, మేనేజ్ మెంట్, హ్యుమానిటీస్, సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సంబంధిత పనిలో అనుభం కలిగి ఉండాలి. వయస్సు 50 ఏళ్లకు మించకూడదు. జీతభత్యంగా నెలకు 90,000రూపాయలు చెల్లిస్తారు.

డేటా అనలిస్ట్ ; ఈ పోస్టుకు సోషల్ సైన్సెస్, మేనేజ్ మెంట్, స్టాటిస్టిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్లు మించరాదు. జీతభత్యాల క్రింద నెలకు 40,000రూ చెల్లిస్తారు.

ప్రాజెక్ట్ అసోసియేట్ ; ఈ పోస్టుకు సోషల్ సైన్సెస్, మేనేజ్ మెంట్, హ్యుమానిటీస్ లో ఎంఏ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయస్సు 40ఏళ్లకు మించకూడదు. నెలకు జీతభత్యాలకు గాను 30,000 చెల్లిస్తారు.

ఫైనాన్స్ అసోసియేట్ ; ఈ పోస్టుకు కామర్స్, కంప్యూటర్ డిగ్రీ అర్హత గా నిర్ణయించారు. ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ లో మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 40 ఏళ్లకు మించకూడదు. నెలకు జీతభత్యాలకు గాను 30,000 చెల్లిస్తారు.

ఆఫీస్ అసిస్టెంట్ ; ఈ పోస్టుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. పనిలో ఐదేళ్ల అనుభవాన్ని కలిగి ఉండాలి. వయస్సు 40 ఏళ్లకు మించరాదు. నెలకు జీతభత్యాలకు గాను 16,000 చెల్లిస్తారు.

ఇక ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను చివరి తేది జనవరి 26, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ http://nirdpr.org.in