కశ్మీర్ లో 3నెలల్లో 10వేల కోట్ల వ్యాపార నష్టం

  • Published By: venkaiahnaidu ,Published On : October 27, 2019 / 03:18 PM IST
కశ్మీర్ లో 3నెలల్లో 10వేల కోట్ల వ్యాపార నష్టం

ఈ ఏడాది ఆగస్టు-5,2019న కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఈ మూడు నెలలో 1,000కోట్ల వ్యాపార నష్టం జరిగినట్లు ఓ ట్రేడ్ బాడీ తెలిపింది. కాశ్మీర్ లోయలో పరిస్థితి ఇంకా సాధారణం కానందున నష్టాల స్వభావాన్ని అంచనా వేయడం కష్టమని కశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు షేక్ ఆశిక్ అన్నారు.

కాశ్మీర్‌లో వ్యాపార నష్టాలు ఈ మూడు నెలల్లో రూ. 10,000 కోట్లు అని ఆయన తెలిపారు. అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఆర్టికల్ 370రద్దు జరిగిన దాదాపు దాదాపు మూడు నెలలు అయ్యిందని, ఇంకా ప్రజలు ప్రస్తుత పరిస్థితుల కారణంగా వ్యాపారం చేయడం లేదని తెలిపారు. ఇటీవలి వారాల్లో కొంత వ్యాపార కార్యకలాపాలు జరిగాయని,కాని వ్యాపారం మందకొడిగా జరిగిందని షేక్ ఆశిక్ తెలిపారు.

వ్యాలీలో ఇప్పటికే ఇంటర్నెట్ సదుపాయం పునరుద్దరించలేదని, నేటి కాలంలో ఏదైనా వ్యాపారం యొక్క ప్రాథమిక అవసరం ఇంటర్నెట్ యాక్సెస్ అని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయాలను నిలిపివేయడం వల్ల వ్యాపారం దెబ్బతింటుందని ఆషిక్ అన్నారు. కాశ్మీర్‌లో వ్యాపారాలు నష్టపోతాయని, ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అధికార యంత్రాంగానికి తెలియజేశామని, ఇది దీర్ఘకాలంలో భారీ పరిణామాలను కలిగిస్తుందని అశిక్ తెలిపారు. నష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, వ్యాపారుల బాధలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.