Russia-Ukraine War: యుక్రెయిన సరిహద్దు దేశాలకు వెళ్లండీ..ఆపరేషన్ గంగను పర్యవేక్షించండీ : ప్రధాని మోడీ ఆదేశం

యుక్రెయిన్ నుంచి భారత విద్యార్ధులకు తరలించే విషయంలో ఇబ్బందుల్ని అధిగమించి తీసుకురావాలని కేంద్రమంత్రులకు ప్రధాని మోడీ ఆదేశించారు. దీంతో మంత్రలు ఆపరేషన్ గంగలో పాల్గొననున్నారు.

Russia-Ukraine War: యుక్రెయిన సరిహద్దు దేశాలకు వెళ్లండీ..ఆపరేషన్ గంగను పర్యవేక్షించండీ : ప్రధాని మోడీ ఆదేశం

Operation Ganga Ukraine Students

Russia-Ukraine War: యుక్రెయిన్ నుంచి భారతీయలను తరలించడంతో ఇబ్బందులు తలెత్తడం, పోలాండ్ సరిహద్దుల్లో భారతీయ విద్యార్థులపై దాడులు కూడా జరగడంతో తరలింపును స్వయంగా పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులను యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపాలని కేంద్రం నిర్ణయించింది. యుక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్లాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఆపరేషన్ గంగ ను పర్యవేక్షించానికి ప్రధాని ఆదేశం మేరకు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ (రిటైర్డ్) వికె సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు.

యుక్రెయిన్‌ పరిణామాలపై మోదీ అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా హంగరీ, పోలాండ్, రొమేనియా, స్లోవాక్ రిపబ్లిక్ దేశాలకు కేంద్రమంత్రులు వెళ్లనున్నారు. విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. యుక్రెయిన్‌లో ఇంకా 15 వేల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు యుక్రెయిన్ నుంచి 11 వందల 56 మంది భారతీయులను తరలించారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఇవాళ అత్యవసరంగా సమావేశం కానుంది. యుక్రెయిన్ పరిణామాలపై 193 దేశాల జనరల్ అసెంబ్లీ చర్చించనుంది.నాలుగు దశాబ్దాల తర్వాత జనరల్ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశమవుతోంది. యుద్ధం మొదలయిన తర్వాత యుక్రెయిన్‌ అంశంపై ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది భద్రతామండలి. రెండు రోజుల క్రితం అమెరికా, అల్బేనియా ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి.

ఈ ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. భారత్, చైనా, యూఏఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. నిన్న మరోసారి భద్రతామండలి ప్రత్యేక సమావేశం జరిగింది. ముసాయిదా తీర్మానంపై జనరల్ అసెంబ్లీలో అత్యవసర చర్చకు ఆమోదం తెలిపింది. భద్రతామండలిలో మొత్తం యుక్రెయిన్‌ అంశంపై మూడుసార్లు ఓటింగ్‌కు దూరంగా ఉంది భారత్. యుద్ధం మొదలుకాకముందు ఓసారి, యుద్ధం మొదలయిన తర్వాత రెండుసార్లు జరిగిన సమావేశంలో తటస్థ వైఖరి అవలంభించింది.
– – –