Russia Man Marries Ukrainian women : ధర్మశాలలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్న ర‌ష్యా,యుక్రెయిన్ జంట‌..

ర‌ష్యా- యుక్రెయిన్ మధ్య నెలల తరబడి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటువంటి సమయంలో భారత్ లో ఉంటున్న రష్యా, యుక్రెయిన్ లకు చెందిన జంట హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోవటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Russia Man Marries Ukrainian women : ధర్మశాలలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్న ర‌ష్యా,యుక్రెయిన్ జంట‌..

Russian Man Marries Ukrainian Girlfriend in Dharamshala

Russian Man Marries Ukrainian Girlfriend in Dharamshala : ర‌ష్యా- యుక్రెయిన్ మధ్య నెలల తరబడి యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే సూచనలు ఎక్కడా కనిపించటంలేదు. ఇటువంటి సమయంలో భారత్ లో ఉంటున్న రష్యా, యుక్రెయిన్ లకు చెందిన జంట హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోవటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ధ‌ర్మ‌శాల‌లో ఉంటున్న ఆ జంట గ‌త ఏడాది కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ర‌ష్యాకు చెందిన సెర్గీ నొవికోవ్‌..యుక్రెయిన్ అమ్మాయి ఎలోనా బ్ర‌మోకాలు స‌నాత‌న హిందూ ధ‌ర్మ ఆచారం ప్ర‌కారం ధ‌ర్మ‌శాల‌లోని దివ్య ఆశ్ర‌మంలో వివాహం చేసుకున్నారు.

వీరి పెళ్లి సోష‌ల్ మీడియాలో సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య వార్ ఈనాడికి కొనసాగుతున్న క్రమంలో శతృదేశాలకు చెందిన ఇద్దరి మధ్య ప్రేమ పుట్టటమేకాదు..వారి వివాహం బంధం ద్వారా ఒక్కటి కావటం సెన్సేషన్ గా మారింది. ఇటువంటి వీరి పెళ్లి ప్ర‌త్యేక‌త సంతరించుకున్న‌ది. స్థానికులు ఈ పెళ్లికి హాజ‌రైన ఆనందంతో డ్యాన్సులు చేశారు. అతిథుల‌కు కంగ్రి థామ్ సంప్ర‌దాయ భోజ‌నాన్ని ఏర్పాటు చేశారు.

తమ మాతదేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ..నోవికోవ్..బ్రమోకాలు రెండు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకను ధర్మశాలను వివాహ ప్రదేశంగా ఎంచుకున్నారు.

దివ్య ఆశ్రమం ఖరోటాకు చెందిన పండిట్ సందీప్ శర్మ వీరి గురించి మాట్లాడుతూ..“వీరిద్దరు సంవత్సరం నుండి ధర్మశాలకు దగ్గరగా ఉన్న ధర్మకోట్‌లో నివసిస్తున్నారని..మా పండిట్ రామన్ శర్మ వారి వివాహాన్ని జరిపి..సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం వివాహం ప్రాముఖ్యత గురించి వారికి వివరించారని తెలిపారు.

వీరి వివాహంలో ‘కన్యాదాన్’తో సహా వివాహ ఆచారాలను నిర్వహించారు. ధరమ్‌కోట్‌లో నివసించే విదేశీ సందర్శకులు వివిధ ఆచారాలలో పాల్గొని పెళ్లిలో పాల్గొన్నారు. ఈ జంట సాంప్రదాయ భారతీయ వివాహ దుస్తులను ధరించారు. అలాగే వివాహంలో ఈ జంట మంత్రాలు చదువుతుండగా పండితులు ఆ మంత్రాల అర్థాని నూతన జంటకు వివరించారు.పండిట్ రామన్ శర్మ ఇద్దరికీ ఒక్కో మంత్రానికి అర్థాన్ని వివరించారు.