Sanjay Raut: కిటికీలు, వెలుతురు లేని గదిలో ఉంచారు

ఈడీపై ఏమైనా ఎలాంటి ఫిర్యాదులైనా ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు రౌత్ ఈ విధంగా బదులిచ్చారు. సంజయ్ రౌత్ చేసిన ఫిర్యాదును స్వీకరించిన ప్రత్యేక కోర్టు, వివరణ ఇవ్వాలంటూ ఈడీని కోరగా.. రౌత్‭ను ఏసీ గదిలో ఉంచినందువల్ల కిటికీలు లేవని సమాధానం ఇచ్చారు. అయితే తాను ఏసీ సిస్టంనే ఉపయోగించుకోలేదని రౌత్ సమాధానం ఇచ్చారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ సౌకర్యానికి దూరంగా ఉన్నానన్నారు. అనంతరం కోర్టు స్పందిస్తూ తగినంత గాలివెలుతురు ఉన్న గదిలోకి రౌత్‭ను మార్చేందుకు కృష్టిస్తామని కోర్టు వెల్లడించింది.

Sanjay Raut: కిటికీలు, వెలుతురు లేని గదిలో ఉంచారు

Sanjay raut complaint to court for no windows and light in ed coustody

Sanjay Raut: పాత్రా చాల్ (గృహ స‌ముదాయం) కుంభ‌కోణానికి సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తాజాగా ఎన్‭ఫోర్స్‭మెంట్ డైరెక్టరేట్‭పై ప్రత్యేక కోర్టు ఫిర్యాదు చేశారు. కిటికీలు లేని, గాలివెలుతురు రాని గదిలో తనను ఈడీ ఉంచి విచారించిందని కోర్టుకు హాజరైన సమయంలో జస్టిస్ ఎంజి దేశ్‭పాండేకు రౌత్ ఫిర్యాదు చేశారు. ఈడీపై ఏమైనా ఎలాంటి ఫిర్యాదులైనా ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు రౌత్ ఈ విధంగా బదులిచ్చారు. సంజయ్ రౌత్ చేసిన ఫిర్యాదును స్వీకరించిన ప్రత్యేక కోర్టు, వివరణ ఇవ్వాలంటూ ఈడీని కోరగా.. రౌత్‭ను ఏసీ గదిలో ఉంచినందువల్ల కిటికీలు లేవని సమాధానం ఇచ్చారు. అయితే తాను ఏసీ సిస్టంనే ఉపయోగించుకోలేదని రౌత్ సమాధానం ఇచ్చారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ సౌకర్యానికి దూరంగా ఉన్నానన్నారు. అనంతరం కోర్టు స్పందిస్తూ తగినంత గాలివెలుతురు ఉన్న గదిలోకి రౌత్‭ను మార్చేందుకు కృష్టిస్తామని కోర్టు వెల్లడించింది.

ఇటీవ‌లే ముంబైలోని సంజ‌య్ రౌత్‌ ఇంట్లో సోదాలు జ‌రిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూప‌ని న‌గ‌దును గుర్తించి, స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. అంత‌కు ముందే సంజ‌య్ రౌత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం విప‌క్ష పార్టీల‌కు వేధించేందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయిస్తోంద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోప‌ణ‌లు చేస్తోన్న వేళ సంజ‌య్ రౌత్‌ను ఈడీ విచారిస్తుండ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. ఇప్ప‌టికే సంజ‌య్ రౌత్ నుంచి ఈడీ అధికారులు కీల‌క వివ‌రాలు రాబ‌ట్టి కోర్టుకు స‌మ‌ర్పించారు. పాత్రా చాల్‌ భూ కుంభకోణం (రూ.1,000 కోట్లు)కు సంబంధించి ఇప్పటికే సంజయ్ రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.