Sbi Bank: 31పైసల రుణం చెల్లించలేదని రైతు పట్ల బ్యాంకు సిబ్బంది వింతప్రవర్తన.. హైకోర్టు ఏం చేసిందంటే..

గుజరాత్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో ఎస్‌బీఐ బ్యాంకుకు రైతు రూ. 31పైసలు బకాయి పడ్డాడు. అయితే బ్యాంకు రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్...

Sbi Bank: 31పైసల రుణం చెల్లించలేదని రైతు పట్ల బ్యాంకు సిబ్బంది వింతప్రవర్తన.. హైకోర్టు ఏం చేసిందంటే..

Sbi Bank

Sbi Bank : గుజరాత్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో ఎస్‌బీఐ బ్యాంకుకు రైతు రూ. 31పైసలు బకాయి పడ్డాడు. అయితే బ్యాంకు రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో తన పొలం కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో మార్పు కాలేదు. దీంతో సదరు కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సంబంధిత బ్యాంకు సిబ్బందిని తీవ్రంగా మందలించింది. వివరాల్లోకి వెళితే…

Bank Holidays: అలెర్ట్.. మే నెలలో బ్యాంకులకు 8 రోజుల సెలవు!

అహ్మదాబాద్ సమీపంలోని ఖోరజ్ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్ స్థానిక ఎస్‌బిఐ బ్యాంకు వద్ద రూ. 3లక్షల రుణం తీసుకున్నారు. 2020లో తన పేరుమీద ఉన్న కొంత భూమిని రాకేశ్ వర్మ, మనోజ్ వర్మకు విక్రయించాడు. ఈ సమయంలో తన పేరుపై బ్యాంకులో ఉన్న రుణాన్ని శ్యాంజీ చెల్లించాడు. శ్యాంజీ భూమిని కొన్న వారు తమ పేరుపై రెవెన్యూ రికార్డుల్లో భూమిని మార్చుకొనేందుకు యత్నించారు. అయితే రుణానికి సంబంధించి బ్యాంకు సిబ్బంది నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వక పోవటంతో కొనుగోలు దారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. నో డ్యూ పత్రాన్ని ఎందుకు ఇవ్వలేదని కోర్టు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా.. రైతు తీసుకున్న రుణంలో ఇంకా 31పైసలు బకాయి ఉన్నాడని, అందుకే ఇవ్వలేదని సమాధానమిచ్చారు. దీంతో న్యాయస్థానం సదరు బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Yes Bank: రూ.300కోట్ల మోసం కేసు నిందితుడికి బెయిల్

బ్యాంకింగ్ రెగ్యూలేషన్ చట్టం ప్రకారం.. 50 పైసల కంటే తక్కువ ఉన్నదాన్ని లెక్కలోకి తీసుకోరు. ఆ రైతు పంట రుణం మొత్తం తిరిగి చెల్లించాడని, అయినా మీరెందుకు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వరంటూ కోర్టు బ్యాంకు సిబ్బందిని మందలించింది. అయితే తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తూ, వచ్చే వాయిదాలో బ్యాంకు మేనేజర్ తప్పకుండా హాజరు కావాలని కోర్టు సూచించింది.