Supreme Court: ఈసీ అనిల్ గోయెల్ నియామకం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ప్రశ్నల వర్షం

సుప్రీం ఆదేశాలను అనుసరించి ఈసీ అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను అటార్నీ జనరల్‌ సమర్పించారు. ఫైళ్ల విచారణ అనంతరం సుప్రీం స్పందిస్తూ.. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశారని కేంద్రాన్ని నిలదీసింది. మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉంది. అయితే మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ అటార్నీ జనరల్‌ను నిలదీసింది.

Supreme Court: ఈసీ అనిల్ గోయెల్ నియామకం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ప్రశ్నల వర్షం

SC questions lightning speed to appointing Arun Goel as Election Commissioner

Supreme Court: ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిపై, స్వతంత్రపై ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన ప్రభుత్వాల్ని కడిగి పారేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఎన్నికల కమిషనర్ అనిల్ గోయెల్ నియామకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని ఈసీగా నియమిస్తారా?’ అంటూ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. కాగా, ఇదే విషయమై గురువారం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన నియామకానికి సంబంధించిన ఫైళ్లను తమకు సమర్పించాలని బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది.

సుప్రీం ఆదేశాలను అనుసరించి ఈసీ అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను అటార్నీ జనరల్‌ సమర్పించారు. ఫైళ్ల విచారణ అనంతరం సుప్రీం స్పందిస్తూ.. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశారని కేంద్రాన్ని నిలదీసింది. మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉంది. అయితే మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ అటార్నీ జనరల్‌ను నిలదీసింది.

‘‘ఈసీ నియామకానికి నలుగురి పేర్లు సిఫార్సు చేస్తే.. అరుణ్‌ గోయల్‌ను మాత్రమే ఎలా నియమించారు? మిగతా వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారు? జూనియర్‌ స్థాయి వ్యక్తిని సీఈసీగా ఎలా ఎంపిక చేశారు? గత సీఈసీ పదవీ విరమణ వరకూ కూడా ఆగకుండా అరుణ్‌ గోయల్‌ను ఎలా ఎంపిక చేశారు? గోయల్‌ ఎంపికలో ఎందుకంత ఉత్సాహం చూపించారు? ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికే ప్రశ్నిస్తున్నాం’’ అని సుప్రీం పేర్కొంది.

Rajastan: పైలట్ సీఎం అవ్వడం లేదా, పైలట్‭ను సీఎం కానివ్వడం లేదా? ఇంతకీ సీఎం గెహ్లాట్ ఏమంటున్నారు?