Plant Water Stress : నీరు లేకున్నా జీవించే మొక్కలు.. పశ్చిమ కనుమల్లో 62 జాతుల మొక్కలు గుర్తింపు

తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ మొక్కలు నిద్రాణస్థితికి చేరుకుంటాయని శాస్త్రేవత్తలు గుర్తించారు. అనంతరం నీటి లభ్యత ఉన్నప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చేస్తాయి.

Plant Water Stress : నీరు లేకున్నా జీవించే మొక్కలు.. పశ్చిమ కనుమల్లో 62 జాతుల మొక్కలు గుర్తింపు

plant species

Western Ghats : భూమి మీద సమస్త జీవకోటికి నీరు ప్రధానం. సాధారణంగా మొక్కలు జీవించాలన్నా, పెరగాలన్నా నీరు అవసరం. కానీ నీరు లేకున్నా మొక్కలు జీవిస్తాయన్న విషయం గుర్తించారు. పశ్చిమ కనుమల్లో తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకొని బతుకుతున్న 62 రకాల మొక్కల జాతులను గుర్తించినట్లు కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ పేర్కొంది.

డిసికేషన్ టాలరెంట్ వ్యాస్కూలర్ (డీటీ)గా పిలిచే ఈ జాతి మొక్కలు తమలోని 95 శాతం నీటిని కోల్పోయినా జీవించే ఉంటాయి. పూణేలోని అఘార్కర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ మందార్ దాతార్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు నిర్వహించారు. అధ్యయన ఫలితాలను నోర్దిక్ జర్నల్ ఆఫ్ బాలనీలో ప్రచురించారు.

biggest plant: ఆస్ట్రేలియా తీరంలో అతిపెద్ద మొక్క.. ఎన్ని కిలోమీటర్లో తెలుసా..!

తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ మొక్కలు నిద్రాణస్థితికి చేరుకుంటాయని శాస్త్రేవత్తలు గుర్తించారు. అనంతరం నీటి లభ్యత ఉన్నప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చేస్తాయి. ఈ మొక్కలపై చేసే పరిశోధనలు ఎడారి, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పంటల సాగుకు ఉపయోగపడతాయని కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వీటిపై మరిన్ని పరిశోధనలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 62 జాతుల్లో 16 జాతులు భారత్ లోని స్థానిక జాతులకు చెందినవని పరిశోధకులు తేల్చారు. 12 జాతులు పశ్చిమ కనుమల్లో మాత్రమే జీవించే జాతులని గుర్తించారు.