SCO Summit: వచ్చే ఏడాది భారత్‌లో ఎస్‌సీవో సదస్సు.. మద్దతు తెలిపిన చైనా

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్ నగరంలో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు ఎస్‌సీవో కూటమి దేశాల అధినేతలు పాల్గొన్నారు.

SCO Summit: వచ్చే ఏడాది భారత్‌లో ఎస్‌సీవో సదస్సు.. మద్దతు తెలిపిన చైనా

SCO Summit

SCO Summit: ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్ నగరంలో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు ఎస్‌సీవో కూటమి దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, వాణిజ్యాన్ని మరింత మెరుగుపర్చుకునే మార్గాలు, అందుకు అవసరమైన సౌకర్యాల కల్పనపై వారు చర్చించారు.

China Skyscraper: చైనాలో 42 అంతస్తుల బిల్డింగులో చెలరేగిన మంటలు.. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడ్డ పొగ.. వీడియోలు వైరల్

ఈ సదస్సులో భాగంగా కూటమి దేశాల అధినేతలు గ్రూప్‌ఫొటో దిగారు. ఈ సమయంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పక్కపక్కనే నిలుచున్నారు. గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ వేదికను పంచుకోవటం ఇదే తొలిసారి. ఇద్దరు నేతలు పక్కపక్కనే నిల్చున్నప్పటికీ ఒకరినొకరు మాట్లాడుకోలేదు. కనీసం ఎలాంటి షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు.

Captain Amarinder Singh: బీజేపీలో చేరనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్.. సొంత పార్టీ విలీనం కూడా

ఇదిలాఉంటే.. వచ్చే ఏడాది ఎస్‌సీవో సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుంది. ఇందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొవిడ్-19 మహమ్మారిని ప్రపంచం దీటుగా ఎదుర్కొంటోదని, దీనికితోడు ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థలకు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన కెనెక్టివిటీ, ఆటంకంలేని రవాణా వ్యవస్థలపై ఎస్‌సీవో దృష్టి సారించాలని అన్నారు. ఈ విషయంలో కూటమి దేశాల మధ్య పరస్పర విశ్వాసం, సహకారానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని తెలిపారు.