Captain Amarinder Singh: బీజేపీలో చేరనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్.. సొంత పార్టీ విలీనం కూడా

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సొంత పార్టీ స్థాపించిన పంజాబ్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన బీజేపీలో చేరుతారు.

Captain Amarinder Singh: బీజేపీలో చేరనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్.. సొంత పార్టీ విలీనం కూడా

Captain Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో ఈ నెల 19న జరిగే కార్యక్రమంలో ఆయన బీజేపీలో చేరుతారు. గత ఏడాది ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీలో విలీనం అవుతుంది.

First Flying Bike: మొదటి ఫ్లైయింగ్ బైక్.. ఎలా ఎగురుతుందో చూడండి.. మార్కెట్లోకి వస్తుందా?

చాలా కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగారు అమరీందర్ సింగ్. గతంలో ఆయన కాంగ్రెస్ తరఫున పంజాబ్ సీఎంగా కూడా పని చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయనను సీఎం పదవి నుంచి తొలగించింది. గత ఏడాది సీఎం పదవి కోల్పోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు.

Guatemala: గ్వాటెమాలా స్వాతంత్ర్య దినోత్సవం రోజు తొక్కిసలాట.. 9 మంది మృతి

స్వయంగా అమరీందర్ సింగ్ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన తిరిగొచ్చిన తర్వాత, ఈ నెల 19న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సమక్షంలో ఆ పార్టీలో చేరుతారు.