Tamilnadu : నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు మహిళలు మృతి

అయితే, నదిలో స్నానానికి వెళ్లి సమయంలో ఇద్దరు ఈత కొట్టే ప్రయత్నంలో డ్యామ్ సమీపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగిపోగా.. వారిని రక్షించేందుకు వెళ్లిన ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Tamilnadu : నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు మహిళలు మృతి

Dead

tamilnadu : తమిళనాడులో విషాదం నెలకొంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు మృతి చెందారు. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు బాలికలు సహా ఏడుగురు మరణించారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లికుప్పం సమీప గ్రామాలకు చెందిన మహిళలు, బాలికలు ఆదివారం (జూన్5,2022) మధ్యాహ్నం కెడిలం నది ఆనకట్ట సమీపంలోకి స్నానానికి వెళ్లారు.

నీటిలోకి దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు నీటిలో మునిగిన వారందరినీ బయటికి తీసి కడలూరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వారిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మృతుల్లో ఐదుగురు కూచిపాళయానికి చెందిన వారు కాగా, ఆయంకురింజిపాడి గ్రామానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెల్లు ఉన్నారు.

Family Drown In Saryu River : స్నానానికి వెళ్లి..నదిలో ముగినిపోయిన ఒకే కుటుంబానికి చెందిన 12మంది

అయితే, నదిలో స్నానానికి వెళ్లి సమయంలో ఇద్దరు ఈత కొట్టే ప్రయత్నంలో డ్యామ్ సమీపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగిపోగా.. వారిని రక్షించేందుకు వెళ్లిన ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులు, కుటుంబం సభ్యులు కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. స్నానానికి వెళ్లి వస్తామని చెప్పి విగతజీవులుగా మారడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.