2020లో కూడా వేల కోట్లు సంపాదిస్తున్న టెక్ బిలియనీర్లు వీళ్లే

  • Published By: venkaiahnaidu ,Published On : June 8, 2020 / 12:52 PM IST
2020లో కూడా వేల కోట్లు సంపాదిస్తున్న టెక్ బిలియనీర్లు వీళ్లే

2020 ఏడాది ప్రపంచంలోని చాలామందికి ఓ పీడకలలా అనిపిస్తోంది. అసలు ఈ ఏడాది తొందరగా అయిపోతే బాగుండు అని చాలామంది కోరుకుంటున్నారు. ప్రపంచదేశాల్లోని ప్రజలందరినీ నెలల పాటు ఇళ్లకే పరిమితం చేసిన 2020సంవత్సరం గురించి ప్రస్తావిస్తేనే అందరికీ చిర్రెత్తుకొస్తుంది. అయితే ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేసిన 2020 ఏడాది కొంతమందికి టెక్ మొఘల్స్ కు మాత్రం కోటానుకోట్ల రూపాయలు లాభాలు తెచ్చిపెట్టిన ఏడాదిగా మిగలనుంది. ప్రజలందరూ ఇళ్లల్లోనే కూర్చుకున్నప్పటికీ ఈ ఏడాది కొందరు టెక్ బిలియనీర్లు వేల కోట్ల రూపాయల ఆదాయాలతో మరింత ధనికులయ్యారు.
జెఫ్ బెజెస్
ఈ భూమిపైనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద రోజురోజుకీ పెరిగిపోతుందట. 2019లో 115బిలియన్ డాలర్ల సంపద ఆయన దగ్గర ఉండగా.2020లో బాగా పెరిగి 150బిలియన్ డాలర్లు అయింది.
ఎలన్ మస్క్
 ఎలన్ మస్క్ స్థాపించిన SpaceX అనే ప్రేవేట్ అమెరికన్ ఏరోస్పేస్ మానుఫ్యాక్చరర్ మరియు స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ సర్వీసెస్ కంపెనీకి చెందిన ఓ అంతరిక్ష నౌక… ఇటీవల ఇద్దరు నాసా వ్యోమగాములను  ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరిక్షంలోకి పంపడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎలన్ మస్క్ కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి తన మొత్తం సంపదకు 20బిలియన్ డాలర్లు అదనంగా చేర్చాడు. ఎలన్ మస్క్ సంపద ఈ ఏడాది 20బిలియన్ డాలర్లు పెరిగింది.
జూకర్ బర్గ్
ఈ రోజుల్లో జూకర్ బర్గ్ పేరు గురించి కొంతమందికి తెలియకపోయినా ఆయన సృష్టించిన ఫేస్ బుక్ మాత్రం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడైన జూకర్ బర్గ్ ఆదాయం కూడా ఈ ఏడాది బాగానే ఉంది. ఫేక్ న్యూస్ విషయంలో జూకర్ బర్గ్ వైఖరిపై ఫేస్ బుక్ ఉద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది ఆయన సంపద 10బిలియన్ డాలర్లు పెరిగి ఆయన మొత్తం సంపద విలువ 87బిలియన్ డాలర్లకు చేరుకుంది.

పోనీ మా
ఇంటర్నెట్ దిగ్గజ టెన్సెంట్ హోల్డింగ్స్ కంపెనీ అధినేత,వీ చాట్ వంటి పలు టాప్ యాప్ ల సృష్టికర్త అయిన పోనీ మా సంపద కూడా 5బిలియన్ డాలర్లు పెరిగి..ఆయన మొత్తం సంపద విలువ 44బిలియన్లకు చేరుకుంది.
ల్యారీ పేజ్ అండ్ సెర్గీ బ్రిన్
అసలు గూగుల్ అంటే తెలియని వారు ఈ రోజుల్లో బహుశా ఎవరూ ఉండరేమో. ప్రపంచానికి గూగుల్ ఓ అద్భుతమైన వరం అని చాలామంది భావిస్తుంటారు. అలాంటి గూగుల్ సహ వ్యవస్థాపకులే ల్యారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ లు. తమ మానసపుత్రిక అయిన గూగుల్ ఆపరేషన్స్ నుంచి వీరిద్దరూ బయటకి వెళ్లిపోయినప్పటికీ ఈ ఏడాది ఒక్కొక్కరి సంపద దాదాపు 4బిలియన్ డాలర్లు పెరిగిందట.