‘మహాభారత్ ఆఫ్ మై లైఫ్’ భార్యా హంతకుడి సూసైడ్ నోట్

  • Published By: Subhan ,Published On : June 25, 2020 / 02:18 PM IST
‘మహాభారత్ ఆఫ్ మై లైఫ్’ భార్యా హంతకుడి సూసైడ్ నోట్

అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యను చంపించడానికి పలు రకాలుగా ఆలోచించిన వ్యక్తి చివరకు తానే హత్య చేయాలని ఫిక్స్ అయిపోయాడు. అతని టార్గెట్ భార్య ఒక్కరే కాదు.. భార్య బంధువులంతా. అందరినీ చంపేయాలని ఫిక్స్ అయి ఆ తర్వాత తానూ చనిపోవాలనుకున్నట్లు 67 పేజీల సూసైట్ నోట్ రాసి అందులో వివరించాడు. 

కాంట్రాక్ట్ కిల్లర్‌తో కార్ యాక్సిడెంట్ చేయించాలనుకుని కుదరక తానే మర్డర్ చేసిన 42ఏళ్ల చార్టెర్డ్ క్రైం స్టోరీ… విడాకుల కోసం ఆరు నెలలుగా వెయిట్ చేస్తున్న భార్యను, ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్లందరినీ మర్డర్ చేయడమే అతని కాన్సెప్ట్. ప్లాన్ చేసుకున్న అమిత్ అగర్వాల్.. భార్య శిల్పిని ఆదివారం బెంగళూరులోని తన ఫ్లాట్ లో చంపేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించి కోల్‌కతాకు వచ్చేశాడు. 

సోమవారం పదేళ్ల కొడుకుతో వచ్చి కోల్ కతా ఎయిర్ పోర్టులోనే ఫ్రెండ్ కు అప్పగించేశాడు. తన అన్న ఇంటికి తీసుకెళ్లి దింపాలని సూచించాడు. ఆ రోజు సాయంత్రం అత్తారింటికి వెళ్లి 65సంవత్సరాల లలితా ధండానియా అనే మహిళపై దాడి చేసి చంపేశాడు. మామ సుభాశ్ ధండానియాను చంపే లోపే పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు. 

గురుగ్రామ్‌లో ఉన్న తన బావమరిది వినీత్‌ను కూడా కోల్‌కతాకు రావాల్సిందిగా కోరాడు. కానీ అతడు రాలేకపోయాడు. బెంగళూరులో శిల్పి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగర్వాల్ ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లుగా బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. ఫ్లాట్‌లో వారి మధ్య పెనుగులాట జరిగినట్లు గుర్తించారు. అగర్వాల్‌ కుమారుడిని అపార్టమెంట్‌లోని గెస్ట్‌ హౌస్‌లో ఉంచి, తరువాత భార్య ఫ్లాట్‌కు వెళ్లి ఆమెను హత్య చేసి ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసి నిందితుడు రాత్రంతా గెస్ట్‌ రూమ్‌లోనే ఉండి ఉదయం కోల్‌కతా వెళ్లినట్లు పేర్కొన్నారు.

తాను రాసిన 67 పేజీల సూసైడ్‌ నోట్‌కు ‘మహాభారత్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అని పేరు కూడా పెట్టాడు. కిరాయి గుండాలతో భార్యను చంపించేందుకు లాక్‌డౌన్‌కు ముందు బిహార్‌కు వెళ్లాడు. పాముతో కాటేయించాలనే ఉద్దేశంతో తమిళనాడుకు వెళ్లొచ్చాడు. కారుతో యాక్సిడెంట్‌ చేయించి చంపించాలని కూడా అనుకున్నాడు.