Son of Domestic worker: కూలీ కొడుకు ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగిగా.. ఓ స్ఫూర్తిదాయకమైన కథనం

ఒక వ్యక్తి ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే, మార్గంలో వచ్చే అడ్డంకులతో సంబంధం లేకుండా దాన్ని సాధించడానికి మార్గాన్ని కనుగొంటే అతను గొప్పవాడే.

Son of Domestic worker: కూలీ కొడుకు ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగిగా.. ఓ స్ఫూర్తిదాయకమైన కథనం

Son

Son of Domestic worker: ఒక వ్యక్తి ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే, మార్గంలో వచ్చే అడ్డంకులతో సంబంధం లేకుండా దాన్ని సాధించడానికి మార్గాన్ని కనుగొంటే అతను గొప్పవాడే. అటువంటివారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ నుండి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురించి కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక యువకుడు తనకు కావాల్సిన దానికోసం ఎంత కష్టపడ్డాడో.. చివరకు సాధించాడు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన భవేష్ లోహర్‌.. ఫోర్డ్ మోటార్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కృషి మరియు దృఢ సంకల్పం సహాయపడినట్లు చెప్పారు. స్ఫూర్తిదాయకమైన ఆ వ్యక్తి కథ ఇప్పుడు లింక్డ్ఇన్ పోస్ట్‌గా వైరల్ అవుతోంది.

“గతంలో జ్ఞాపకాలు ఎప్పుడూ మధురమే. నేను ప్రభుత్వ పాఠశాలకు కాలినడకన చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్నాను. నేను మరియు నా ఇద్దరు స్నేహితులు పెద్దయ్యాక భవిష్యత్తులో కొనుగోలు చేసే కార్ల గురించి చర్చించుకునేవాళ్లం. ఆ రోజుల్లో నాకు ఫోర్డ్ కారు అంటే చాలా ఇష్టం.. వార్తాపత్రిక ప్రకటనల్లో మాత్రమే కనిపించే ఆ కారును చూశాను.. నేను ఎలాగైనా డబ్బు సంపాదించి ఆ కారు కొనాలనుకుంటున్నాను “అని లోహర్ పోస్ట్‌లో వెల్లడించాడు.

భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి) లో చదివిన లోహర్, 2020లో లాక్డౌన్ సమయంలో తన కళాశాల హాస్టల్‌ని విడిచిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని తండ్రి ఓ సాధారణ కూలీ. తన జీవిత పోరాటం గురించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ, లోహార్ తాను కష్టపడి చదివానని మరియు పెద్ద కంపెనీలలో ఇంటర్వ్యూలు ఇచ్చానని పేర్కొన్నాడు. చివరగా, తన కలల కంపెనీలో ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఇంకా తన పోస్ట్‌లో తన చదువు కోసం తన అక్కలు వారి చదువులను వదులుకున్నారని, తన తండ్రికి వచ్చే కూలీ కుటుంబం మొత్తం తినడానికి కూడా సరిపోయేది కాదని చెప్పారు.