Rahul Gandhi: రాహుల్ గాంధీ పర్మిషన్ ఇవ్వడానికి మీరెవరు.. ‘అది నా హక్కు’

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి విలువైన సూచనలిచ్చారు. మోషన్ డిబేట్ జరుగుతున్నప్పుడు పార్లమెంటరీ పద్ధతిని పాటించడం తెలుసుకోండని చెప్పారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ పర్మిషన్ ఇవ్వడానికి మీరెవరు.. ‘అది నా హక్కు’

Rahul Gandhi

Rahul Gandhi: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి విలువైన సూచనలిచ్చారు. మోషన్ డిబేట్ జరుగుతున్నప్పుడు పార్లమెంటరీ పద్ధతిని పాటించడం తెలుసుకోండని చెప్పారు. రాహుల్ గాంధీ మాట్లాడి.. మరో ఎంపీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో స్పీకర్ ఇలా స్పందించాఎవరిరు.

‘పర్మిషన్ ఇవ్వడానికి నువ్వెవ్వరు? నీకు ఆ అధికారం లేదు. అది నా హక్కు. ఎవరినైనా మాట్లాడేందుకు వీలు కల్పించే హక్కు నీకు లేదు. కేవలం చైర్ మాత్రమే అది డిసైడ్ చేస్తుంది’ అని కామెంట్ చేశారు. వెంటనే అందుకున్న కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ.. నేను ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తిని. ఇతరులు మాట్లేందుకు అవకాశం కల్పిస్తా’ అని బదులివ్వడంతో స్పీకర్ బిర్లా అసహనం వ్యక్తం చేశారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘మీరెవరి మాట వినాల్సిన అవసరం లేదు. ఇవాళ నా దళిత సహచరుడు మాట్లాడుతున్నాడు. పాశ్వన్ గారికి దళిత చరిత్ర తెలుసు. 3వేల సంవత్సరాలుగా వారిని అణచివేసిందెవరో తెలుసు. అతణ్ని చూసి గర్విస్తున్నాను. అతని మనసులో ఉన్న విషయం నాకు చెప్పాడు. కాకపోతే అతను తప్పుడు పార్టీలో ఉన్నాడంతే. బాధపడకు. కంగారు పడకు’ అని గాంధీ అన్నారు.

Read Also:’శ్రేయాస్ అయ్యర్ కోసం ఆర్సీబీ రూ.20కోట్లు’

దానికి రిప్లై ఇచ్చిన పాశ్వాన్.. ‘రాహుల్ గాంధీ నేను తప్పుడు పార్టీలో ఉన్నానన్నారు. రాహుల్ గాంధీ తర్వాత మాట్లాడేందుకు నాకు అవకాశమిచ్చింది నా పార్టీనే. ఆ పార్టీయే నన్ను మూడు సార్లు ఎంపీని చేసింది. అంతకంటే ఎక్కువ ఇంకేంకావాలి?’ అని సమాధానమిచ్చాడు.