కప్పలు కనిపించడం కూడా విచిత్రమైపోయింది.. ఫాఫం నెటిజన్లు

కప్పలు కనిపించడం కూడా విచిత్రమైపోయింది.. ఫాఫం నెటిజన్లు

ఏదో పులి కనపడినట్లుగా మారిపోయింది పరిస్థితి. అస్సాంలో గోల్డెన్ టైగర్ కనిపించినంతగా వైరల్ అవుతుందీ వీడియో ఇంతకీ అసలు విషయం తెలుసా.. పసుపు రంగులో ఉండే కప్పలు. వర్షం నీళ్లలో తిరుగుతూ మధ్యప్రదేశ్ లోని నార్‌సింగ్‌పూర్ లో కనిపించాయి. వాటిని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ కూడా ఇమేజ్ షేర్ చేశారు. ఇండియన్ బ్లూ ఫ్రాగ్..(బ్లూ కలర్ నుంచి పసుపు రంగులోకి) మారే కప్పలు కనిపించాయి. సీజన్ ఛేంజ్ కారణంగా ఆడకప్పలను అట్రాక్ట్ చేయడానికి మగ కప్పలు ఇలాంటి స్టంట్లు చేస్తుంటాయి.

దక్షిణ భారతదేశంలో ఈ కప్పలు కనిపించడం షరా మామూలే కానీ, మహారాష్ట్రలో అది విచిత్రం అయిపోయింది. ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి. కామెంట్ల వెల్లువ తగ్గలేదు. ఒకరైతే పసుపురంగు కప్పలు చూస్తానని కలలో కూడా అనుకోలేదని కామెంట్ చేశారు. మీలో కూడా ఇంకా ఈ కప్పలను చూడని వారెవరైనా ఉంటే ఓ లుక్కేసి లైక్ కొట్టేయండి మరి..