corona vaccine : కరోనా వ్యాక్సిన్ ఎగుమతికి బ్రేక్

దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... దేశీయ అవసరాల కోసం భారత సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించింది.

corona vaccine : కరోనా వ్యాక్సిన్ ఎగుమతికి బ్రేక్

Temporary Break For Corona Vaccine Exports

break for corona vaccine exports : దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో… దేశీయ అవసరాల కోసం భారత సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. అంటువ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ డిమాండ్‌ను తీర్చేందుకే ఎస్‌ఐఐ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అన్ని ప్రధాన ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ చర్య ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుగల గ్లోబల్ కోవాక్స్ వ్యాక్సిన్ షేరింగ్ సరఫరాను ప్రభావితం చేస్తుంది. ఎస్‌ఐఐ నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ నేరుగా మోతాదులను కొనుగోలు చేసి ప్రపంచంలో 64 తక్కువ ఆదాయ దేశాలకు అందిస్తోంది. ఈ కార్యక్రమానికి యూనిసెఫ్ మద్దతు తెలుపుతోంది. అయితే భారత్‌ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలపై కూడా పడనుంది.

మార్చి, ఏప్రిల్ నెలలో పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు సీరం ఇనిస్టిట్యూట్‌ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం భారత్ తీసుకున్న నిర్ణయంతో మరిన్ని మోతాదులకు ఎగుమతి లైసెన్సులు పొందడంలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సుమారు 17.7 మిలియన్ ఆస్ట్రాజెనెకా మోతాదులను సీరం సంస్థ ఎగుమతి చేసింది. అయితే వ్యాక్సిన్ ఎగుమతులపై భారత్‌ తాత్కాలిక నిషేధం విధించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

ప్రస్తుతం భారత్‌లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… మరింత మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ప్రతి ఒక్కరిలో నిర రోగ నిరోధక శక్తి పెరగడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలమనేది మోదీ సర్కార్ ఆలోచన. దేశంలో చాలా మందికి టీకాలు వేయాల్సిన అవసరం ఉన్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అటు ఆస్ట్రాజెనెకా డ్రగ్‌ను బ్రెజిల్, బ్రిటన్, మొరాకో, సౌదీ అరేబియా దేశాలకు రవాణా చేయడంలో ఎస్‌ఐఐ ఆలస్యం చేసింది. తమకు రావాల్సిన 5 మిలియన్ మోతాదుల రెండవ బ్యాచ్‌ కోసం బ్రిటిష్ అధికారులు ఇప్పటికే కేంద్ర వైద్య శాఖకు లేఖలు రాశారు కూడా. కోవాక్స్ ద్వారా వ్యాక్సిన్లు అందుకోవాల్సిన అన్ని దేశాలకు డెలివరీ ఆలస్యం అవుతుందని… ఇప్పటికే యూనిసెఫ్ ప్రకటించింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత… ఏప్రిల్, మే నెలల్లో వ్యాక్సిన్లు అందజేస్తాని యూనిసెఫ్‌కు ఆస్ట్రాజెనెకా సంస్థ తెలిపింది.

భారత్‌లో ఇప్పటివరకు 52 మిలియన్లకు పైగా వ్యాక్సిన్లను సరఫరా చేసింది. వీటిలో 37 మిలియన్లు ఎస్‌ఐఐ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వెర్షన్. మిగిలినది భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్. మరో 141 మిలియన్ మోతాదులను సరఫరా చేయాలని SII ని భారత్‌ కోరింది.