Central Govt : 5-12 ఏళ్ల లోపు పిల్లలకు టీకాపై నేడే కేంద్రం కీలక నిర్ణయం

నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా 5 నుంచి 12 ఏళ్ల వారికి టీకా పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఎన్‌టీఏజీ నిపుణుల కమిటీ ఇవాళ సమావేశం కానుంది.

Central Govt : 5-12 ఏళ్ల లోపు పిల్లలకు టీకాపై నేడే కేంద్రం కీలక నిర్ణయం

Children Vaccine

central government : చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్ ఇమ్యూనైజేషన్‌ నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా 5 నుంచి 12 ఏళ్ల వారికి టీకా పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఎన్‌టీఏజీ నిపుణుల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఈ భేటీలో చిన్నారులకు వ్యాక్సినేషన్‌ చర్చించనున్నారు. ఇప్పటికే రెండు టీకాలకు డీసీజీఐ అత్యవసర అనుమతులు జారీ చేసింది.

Corona Vaccine : 5-12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. నిర్ణయంపై ఉత్కంఠ

6 నుంచి 12 ఏళ్ల వారి కోసం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, 5 నుంచి 12 ఏళ్ల వారి కోసం బయోలాజికల్‌ -ఇ తయారు చేసిన కార్బెవాక్స్‌ టీకా అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో కలవర పెడుతున్నాయి. ఇప్పటి వరకు పెద్దలకు, టీనేజ్ పిల్లలకు వ్యాక్సినేషన్ చేశారు. ఇక చిన్న పిల్లలకు టీకాలు ఇవ్వాల్సి ఉంది. దీంతో వారికి కూడా టీకాలు ఇచ్చి…వైరస్ బారిన పడకుండా చూడాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.