Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ సీఎంను కొరడాతో కొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్.. మీరూ చూడండి..

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను ఓ వ్యక్తి కొరడాతో కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్వయంగా సీఎం భూపేశ్ బఘేల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ సీఎంను కొరడాతో కొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్.. మీరూ చూడండి..

Chhattisgarh CM Bhupesh Baghel

Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను ఓ వ్యక్తి కొరడాతో కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్వయంగా సీఎం భూపేశ్ బఘేల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. సీఎంను ఓ సాధారణ వ్యక్తి కొట్టడం ఏమిటని నెటిజన్లు వీడియోను చూడగా అసలు విషయం తెలిసి నవ్వుకుంటున్నారు.

WhatsApp Services Down: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. మీమ్స్‌తో నెటిజన్ల హల్‌చల్.. మెటా ప్రతినిధులు ఏమన్నారంటే..

దీపావళి మరుసటి రోజు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గౌరి-గౌర పూజ నిర్వహిస్తారు. దీనిలోభాగంగా జజన్ గిరి, కుమ్హారి గ్రామాల్లోని వారి సాంప్రదాయ పద్దతిలో ప్రతీయేడాది వేడుకలు పెద్దఎత్తున నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో సీఎం ప్రతీయేటా పాల్గొంటారు. వారి జానపద సాంప్రదాయంతో కూడిన ఆచారాలను పాటిస్తారు. ఈసారి కూడా ఈ వేడుకల్లోనేందుకు సీఎం భూపేశ్ బఘేల్ అక్కడికి వెళ్లారు.

దీపావళి మరుసటిరోజు రాష్ట్రంలో గౌరి-గౌర పూజ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా చెడును తరిమికొట్టేందుకు కొరడా దెబ్బలు కొడతారు. అన్ని విఘ్నాలు తొలగేందుకు రాష్ట్ర ప్రజలకోసం భూపేశ్ ఈ పూజల్లో పాల్గొని మణికట్టుపై కొరడా దెబ్బలు తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా సీఎం భూపేశ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.