Coronavirus In India: ఢిల్లీలో మినహా దేశంలో తగ్గుముఖం పట్టిన కొవిడ్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన వారం రోజులుగా కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం..

Coronavirus In India: ఢిల్లీలో మినహా దేశంలో తగ్గుముఖం పట్టిన కొవిడ్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే..

Corona cases

Coronavirus In India: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన వారం రోజులుగా కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల వ్యవధిలో 3.64 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,062 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2.49శాతంగా నమోదైంది. మంగళవారం ఒక్కరోజు 15,220 మంది కోలుకున్నారు.

Hyderabad IKEA: క్యారీ బ్యాగ్‌కు బిల్లు తీసుకున్నందుకు.. హైదరాబాద్‌లోని ఐకియాకు జరిమానా

గత కొద్దిరోజులుగా క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 1.05 లక్షలకు తగ్గాయి. క్రియాశీల రేటు 0.24శాతానికి తగ్గగా రికవరీ రేటు 98.57శాతానికి పెరిగింది. ఇదిలా ఉంటే కొవిడ్ తో చికిత్స పొందుతూ గడిచిన 24గంటల్లో 36 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 208.57 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది.

Delhi Covid-19 Cases: ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు

ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 917 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకంటే ముందు 14.57 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 19.2శాతంకు పెరిగింది. కొవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ. 500 జరిమానా విధిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ 5,387 మంది హోం ఐసోలేషన్ లో ఉండగా, 563 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన వారిలో 90శాతం మంది బూస్టర్ డోసు తీసుకోలేదని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా వెల్లడించారు.