Hyderabad IKEA: క్యారీ బ్యాగ్‌కు బిల్లు తీసుకున్నందుకు.. హైదరాబాద్‌లోని ఐకియాకు జరిమానా

క్యారీ బ్యాగ్‌కు బిల్లు తీసుకున్నందుకు హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్ కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. కస్టమర్ నుంచి రూ.20 తీసుకుని ఐకియా సిబ్బంది క్యారీ బ్యాగ్ ఇచ్చారు. ఆ క్యారీ బ్యాగుపై ఐకియా పేరు ముద్రించి ఉంది. దీంతో ఐకియాకు వినియోగదారుల కమిషన్‌ మొత్తం రూ.6,020 జరిమానా విధించింది.

Hyderabad IKEA: క్యారీ బ్యాగ్‌కు బిల్లు తీసుకున్నందుకు.. హైదరాబాద్‌లోని ఐకియాకు జరిమానా

Hyderabad IKEA

Hyderabad IKEA: క్యారీ బ్యాగ్‌కు బిల్లు తీసుకున్నందుకు హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్ కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. కస్టమర్ నుంచి రూ.20 తీసుకుని ఐకియా సిబ్బంది క్యారీ బ్యాగ్ ఇచ్చారు. ఆ క్యారీ బ్యాగుపై ఐకియా పేరు ముద్రించి ఉంది. దీంతో ఐకియాకు వినియోగదారుల కమిషన్‌ మొత్తం రూ.6,020 జరిమానా విధించింది. అందులో కస్టమర్ కు రూ.20 (క్యారీ బ్యాగ్ చార్జ్), క్యారీ బ్యాగ్ ను డబ్బులు చెల్లించాలని కస్టమర్ ను ఇబ్బంది పెట్టినందుకు పరిహారంగా మరో రూ.1,000 చెల్లించాలని చెప్పింది.

అలాగే, వినియోగదారుల న్యాయసలహా నిధి ఖాతాలో రూ.5 వేలు వేయాలని పేర్కొంది. ఈ జరిమానా అంతా 45 రోజుల్లో జమ చేయాలని తెలిపింది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. కెవిన్‌ సుకీర్తి అనే లా విద్యార్థిని 2020, జనవరి 26న హైదరాబాద్, హైటెక్ సిటీలోని ఐకియా స్టోర్ కు వెళ్ళారు. రూ.1,071 విలువజేసే వస్తువులను కొనుక్కున్నారు. అయితే, వాటికిగాను క్యారీ బ్యాగ్ ఇవ్వాలంటే రూ.20 ఇవ్వాల్సిందేనని బిల్లింగ్ కౌంటర్ వద్ద సిబ్బంది చెప్పారు. ఆ క్యారీ బ్యాగ్ పై ఐకియా లోగో ఉంది.

ఈ తీరు దేశంలో వినియోగదారులకు సంబంధించిన పలు కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు ఇది విరుద్ధమని కెవిన్ సుకీర్తి అన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ ను ఆశ్రయించారు. కెవిన్ అన్ని ఆధారాలను సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఐకియాకు కమిషన్ రూ.6,020 జరిమానా విధించింది.

Lok Sabha Polls 2024: బిహార్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ