Assam : టీచర్‌తో ఇంగ్లీషు మాట్లాడటానికి తికమక పడ్డ స్టూడెంట్స్ .. పిల్లలపై ఒత్తిడి పనికిరాదని మండిపడ్డ నెటిజన్లు

గొడవ పడ్డ ఇద్దరు స్టూడెంట్స్ టీచర్‌కి ఆ విషయం ఇంగ్లీష్‌లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వీరి సంభాషణకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అన్ని సందర్భాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

Assam : టీచర్‌తో  ఇంగ్లీషు మాట్లాడటానికి తికమక పడ్డ స్టూడెంట్స్ .. పిల్లలపై ఒత్తిడి పనికిరాదని మండిపడ్డ నెటిజన్లు

Assam

Assam : ఇద్దరు విద్యార్ధులు తాము కొట్టుకున్న విషయాన్ని టీచర్‌కి ఇంగ్లీషులో చెప్పడానికి తికమక పడ్డారు. ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నియమం వల్ల తమ మధ్య జరిగిన గొడవను వారు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Ghost : బాయ్‌ఫ్రెండ్ కత్తితో పొడిచి చంపబోతే, దెయ్యం వచ్చి కాపాడిందట .. దెయ్యానికి ధన్యవాదాలు చెబుతున్న టీచర్

అస్సాంలోని పాచిమ్ నాగాన్‌లో ఉన్న న్యూ లైఫ్ హైస్కూల్‌  ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘మిమ్మల్ని ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడమన్నప్పుడు’ అనే శీర్షికతో ఈ పోస్ట్ షేర్ చేశారు. ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ రూమ్‌లో గొడవ పడ్డారు. అయితే తాము గొడవపడ్డామనే విషయం టీచర్ కి చెప్పడానికి ఆంగ్ల పదాల కోసం కష్టపడ్డారు. అందుకోసం హావభావాలు పలికించారు. టీచర్ ఏం జరిగిందో చెప్పమని అడిగినపుడు ఆదిల్ అనే స్టూడెంట్ తన మెడ పట్టుకున్నాడని ఉదీప్ వివరించే ప్రయత్నం చేశాడు. ఇక ఆదిల్.. ఉదీప్ తన మెడ పట్టుకున్నాడని సైగతో చెప్పాడు. వచ్చీరాని పదాలు, సైగలతో టీచర్‌కి తమ తగాదా కష్టపడి కమ్యూనికేట్ చేశారు. అంతా విన్న టీచర్ మళ్లీ గొడవ చేస్తే పోలీసుకి ఫోన్ చేసి జైలుకి పంపిస్తా అని హెచ్చరించాడు. ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుని షేర్ హ్యాండ్ ఇచ్చుకుని అక్కడి నుంచి వెళ్లారు.

TS High Court : టీచర్‌ను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా..? : ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందించారు. ఇలాంటి కఠినమైన నియమాలు పిల్లలు ఇంగ్లీషు నేర్చుకునేలా చేయవని..కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో పిల్లలు ఏ భాషలో మాట్లాడగలరో ఆ భాషలో కమ్యూనికేట్ చేయడానికి అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.