ఆ ఊళ్లో ఒకే ఒక్క కొవిడ్ నెగెటివ్ వ్యక్తి

ఆ ఊళ్లో ఒకే ఒక్క కొవిడ్ నెగెటివ్ వ్యక్తి

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్ గ్రామంలో ఒక్క వ్యక్తికి మాత్రమే కొవిడ్ నెగెటివ్ అని తేలింది. మనాలి లేహ్ హైవేలో నివాసం ఉంటున్న వారందరికీ ఒకేసారి టెస్టులు నిర్వహించారు. వారిలో చాలా మంది చలి ఎక్కువగా ఉండటంతో కుల్లు నుంచి వలసకు వచ్చి బతుకుతున్నారు.

ప్రయాణ నిబంధనలు ఎత్తేయడంతో టూరిస్టులు ఆ ప్రాంతానికి వచ్చే అవకాశముందని వారికి టెస్టులు నిర్వహించారు. ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ పొందగలిగాడు.



52ఏళ్ల భూషణ్ ఠాకూర్ కొవిడ్-19 నియమాలు తూచా తప్పకుండా పాటిస్తూ.. ఉన్నాడు. కుటుంబ సభ్యులకు కొవిడ్ పాజిటివ్ రావడంతో వారి నుంచి విడిగా ఉంటూ వంట చేసుకుని గడిపేస్తున్నాడు.

తొరంగ్ లోయ ప్రాంతంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మతపరంగా కొద్ది రోజుల క్రితం వారంతా ఒక చోటికి చేరారు. ఇప్పటినుంచి లాహౌల్ గ్రామానికి ప్రయాణికుల రాకపోకలను పూర్తిగా ఆపేశారు. ఇంతకీ ఆ గ్రామంలో ఉండేది ఎంత మందో తెలుసా 42మంది మాత్రమే.

లాహౌల్-స్పితి లోయ అనేది హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత దారుణంగా ఎఫెక్ట్ అయిన జిల్లాల్లో ఒకటి. గురువారం ఆ రాష్ట్రంలో మరో 12కరోనా మృతులు సంభవించినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ 481మంది కరోనా కారణంగా చనిపోయారు. 796కొత్త కేసులు నమోదై 32వేల 198మందికి చేరింది.