ఢిల్లీలో కరోనా కలకలం 

ఢిల్లీలో మూడు కరోనా వైరస్ అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 05:22 AM IST
ఢిల్లీలో కరోనా కలకలం 

ఢిల్లీలో మూడు కరోనా వైరస్ అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.

ఢిల్లీలో మూడు కరోనా వైరస్ అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. ఆ ముగ్గురిని వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారు. అయితే కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే చైనాలో 106 మంది మృతి చెందారు. మరో 1300 కేసులు కొత్తగా నమోదైనట్లు చైనా హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఇప్పటి వరకూ కరోనా కేసులు 4,515 ఉన్నాయని వెల్లడించింది.
Read Also: కరోనా వైరస్ ఎలా పుట్టింది? పాముల నుంచి మనుషుల్లోకి ఎలా?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఢిల్లీలో మూడు, హైదరాబాద్ లో మూడు, ముంబైలో మరో ఐదు కేసులు, రాజస్థాన్ లో ఆరు నుంచి ఏడు కేసులు నమోదు అయ్యాయి. వీరందరికీ కరోనా వైరస్ సోకిందని వైద్యులు భావిస్తున్నారు. వాటికి సంబంధించిన సింప్టమ్స్ వైద్యుల పరీక్షల్లోనే తేలే అవకాశం ఉంటుంది. మొదటగా ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు కూడా మారుతున్నాయి.

c virus

పొగమంచు, వర్షం, చలి తీవ్రత, వాయు కాలుష్యం అధికమవుతున్న తరుణంలో ఇటువంటి సింప్టమ్స్ కామన్ గానే ఉంటాయని చెబుతున్నా.. కరోనా వైరస్ కలకలం చైనాలో ఇప్పటివరకు 106 మంది చనిపోయారు. వూహాన్ పట్టణం దిగ్బంధంలో ఉంది. వూహాన్ పట్టణంలో 250 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అక్కడి నుంచి ప్రయాణాలను చైనా ప్రభుత్వం నిషేధించింది.
 

delhi

కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా ఏడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా వైద్య పరీక్షల కోసం విభాగాలను ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనుమానిత లక్షణాలున్న వారిని అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రులకు పంపే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చైనా నుంచి వచ్చిన భారతీయులు ఐదుగురు కరోనా అనుమానితులుగా ఉన్నారని వైద్యులు చెప్పారు.

delhi

కరోనా వైరస్ స్వైన్ ఫ్లూ వంటిదేనని, దగ్గులు, తమ్ములు, జలుబు వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుందని చెప్పారు. నిరంతరం వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్‌ను నిరోధించుకోవచ్చని వెల్లడించారు.
Read Also : సైంటిస్టులు కనిపెట్టేశారు: #Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!