Hanuman Janmotsav: గాలిలో డ్రోన్లు, నేలపై రెండింతల భద్రత నడుమ ‘హనుమాన్ జయంతి’

బిహార్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. బీహార్‌షరీఫ్, నలంద, ససారం ప్రాంతాల్లో మతపరమైన హింస చెలరేగింది. దీంతో ఆయన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బీహార్ గవర్నర్‌కు హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి విషయం ఆరా తీశారు. అనంతరం బీహార్‌లోని సున్నితమైన ప్రాంతాలకు కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయించారు.

Hanuman Janmotsav: గాలిలో డ్రోన్లు, నేలపై రెండింతల భద్రత నడుమ ‘హనుమాన్ జయంతి’

Security

Hanuman Janmotsav: రామ నవమి రోజున పశ్చిమ బెంగాల్, బీహార్ సహా ఇతర రాష్ట్రాల్లో చెలరేగిన ఘర్షణలు, జరిగిన హింస అనంతరం.. హనుమాన్ జయంతి సందర్భంగా కూడా జరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. గురువారం హనుమాన్ జన్మోత్సవ వేడుకల్లో ఎక్కడ చూసినా డ్రోన్లు కనిపిస్తున్నాయి. అలాగే భద్రత కూడా ఒక్కోచోట రెండింతలు కనిపిస్తోంది. శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా చూడాలని, సమాజంలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించే అంశాలను పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం బుధవారం కోరింది.

CRPF Recruitment : సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ లో భారీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

పశ్చిమ బెంగాల్‌లో రామనవమి వేడుకల సందర్భంగా హింస చెలరేగిన కొన్ని రోజుల తర్వాత హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పోలీసులకు సహాయంగా కేంద్ర సాయుధ బలగాలను మోహరించినట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని హుగ్లీ, హౌరా ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపులపై ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో అగ్నిబాంబు దాడులు కూడా చోటు చేసుకున్నాయి. పలు వాహనాలను తగులబెట్టారు, దుకాణాలను ధ్వంసం చేశారు. దీనికి ముందు రోజు ఆదివారం కూడా రాష్ట్రంలోని రిష్రాలో ఘర్షణలు చెలరేగాయి. ఇందులో బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్, పార్టీ పుర్సురా ఎమ్మెల్యే బిమన్ ఘోష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

Maharashtra: హెయిర్ కటింగ్ నచ్చలేదని 16వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలుడు

ఇక బిహార్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. బీహార్‌షరీఫ్, నలంద, ససారం ప్రాంతాల్లో మతపరమైన హింస చెలరేగింది. దీంతో ఆయన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బీహార్ గవర్నర్‌కు హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి విషయం ఆరా తీశారు. అనంతరం బీహార్‌లోని సున్నితమైన ప్రాంతాలకు కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయించారు.