Toddler raped by 13-year-old boy : ఫోన్‌లో బ్లూఫిలిమ్ చూసి రెండేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అఘాయిత్యం

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ కారణంగా ఊహించని అనర్థాలు, దారుణాలూ జరిగిపోతున్నాయి. కనీవిని ఎరుగుని రీతిలో ఘోరాలు, నేరాలు చోటు చేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని పిల్లలు పెడదారి పడుతున్నారు. చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ పుస్తకాలు చదువుకోవాల్సిన పిల్లలు.. భయానకమైన పనులకు పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో చూడకూడనివి చూసి చెడిపోతున్నారు.

Toddler raped by 13-year-old boy : ఫోన్‌లో బ్లూఫిలిమ్ చూసి రెండేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అఘాయిత్యం

Toddler raped by 13-year-old boy after watching film: ఇప్పుడు దాదాపు అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ జీవితంలో భాగమైపోయింది. చిన్న, పెద్ద.. ధనిక, పేద.. అనే తేడా లేదు.. అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్ సౌకర్యం వచ్చేసింది. ఏ పని అయినా సింపుల్ గా స్మార్ట్ ఫోన్ లోనే చేసేస్తున్నారు. దీంతో పనులు చాలా ఈజీ అయ్యాయని అంతా సంతోషిస్తున్నారు. అదే సమయంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ కారణంగా ఊహించని అనర్థాలు, దారుణాలూ జరిగిపోతున్నాయి. కనీవిని ఎరుగుని రీతిలో ఘోరాలు, నేరాలు చోటు చేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని పిల్లలు పెడదారి పడుతున్నారు. చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ పుస్తకాలు చదువుకోవాల్సిన పిల్లలు.. భయానకమైన పనులకు పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో చూడకూడనివి చూసి చెడిపోతున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. 13ఏళ్ల బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. సెల్ ఫోన్ లో బ్లూఫిలిమ్ చూసిన బాలుడు.. రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది.

ఫోనులో నీలిచిత్రం చూసిన బాలుడు.. ఆ ప్రభావంతో రెండేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. రేవతి బ్లాకులోని ఓ గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న చిన్నారి మంగళవారం(మార్చి 16,2021) ఆడుకుంటూ పొరుగింటికి వెళ్లింది. అప్పటికే నీలిచిత్రం చూసి దాని ప్రభావానికి లోనైన బాలుడు చిన్నారిపై అఘాయిత్యం చేశాడు. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పిల్లల ప్రవర్తన అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు అడిగిన వెంటనే స్మార్ట్ ఫోన్లు కొనివ్వడం తప్పు కాదు. కానీ, ఆ ఫోన్ లో వారు ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది నిత్యం ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్లు కొనిస్తే సరిపోదని, వారు పెడదోవ పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని నిపుణులు తేల్చి చెప్పారు.