White Musli Farming: తక్కువ పెట్టుబడితో లక్షలు కురిపిస్తున్న మూలిక!

వ్యవసాయం ఇప్పుడు కాస్ట్ లీగా మారిపోయింది. పెట్టుబడి భారీగా పెరిగిపోవడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటలను, ఔషధ మొక్కల పెంపకం సాగు చేపడితే లాభాల బాట పట్టనున్నారు. గుజరాత్‌లోని దాంగ్‌ జిల్లా రైతులు ఇప్పుడు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు.

White Musli Farming: తక్కువ పెట్టుబడితో లక్షలు కురిపిస్తున్న మూలిక!

White Musli Farming (1) (1)

White Musli Farming: వ్యవసాయం ఇప్పుడు కాస్ట్ లీగా మారిపోయింది. పెట్టుబడి భారీగా పెరిగిపోవడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటలను, ఔషధ మొక్కల పెంపకం సాగు చేపడితే లాభాల బాట పట్టనున్నారు. గుజరాత్‌లోని దాంగ్‌ జిల్లా రైతులు ఇప్పుడు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. ఇక్కడి రైతులు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వైట్ మస్లీ అనే మూలికల పంటతో కాసులు పండిస్తున్నారు.

దాంగ్‌ జిల్లాలో రైతులు తెలుపు మస్లీ మూలికల పంటలు పండిస్తున్నారు. దీన్నే సఫేద్ మస్లీ అని కూడా అంటారు. వర్షాకాలంలో చేపట్టే ఈ మూలిక సాగుతో రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. దీంతో వీరి జీవన శైలి చాలా మెరుగైంది. పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతిలో ఈ మూలికల సాగు చేపట్టడంతో తక్కువ పెట్టుబడితోనే పంటను సాధిస్తున్నారు. మరోవైపు మార్కెటింగ్ కూడా చాలా సులభతరంగా ఉండడంతో ఇక్కడి రైతులు వెనక్కు తిరిగి చూసే అవసరం లేకుండా సాగు మీద దృష్టి పెడుతున్నారు.

White Musli Farming

White Musli Farming

వైట్ మస్లీ మూలికలు అధిక బరువు తగ్గేందుకు, అంగ స్తంభన సమస్యలకు, డయాబెటిస్ అదుపులో ఉంచుకునేందుకు బాగా పనిచేస్తుంది. దీనికి ఇండియాతోపాటూ విదేశాల్లోనూ డిమాండ్ ఉండగా మూలికలతో పాటు టానిక్ రూపంలో కూడా లభిస్తుంది. పంట చేతికి రాగానే స్థానిక షాపులతో పాటు స్థానిక ఫార్మా కంపెనీల ప్రతినిధులు రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం ఆయుర్వేద మందులతో పాటు వైట్ మస్లీతో తయారుచేసిన మందులను ఆయుర్వేద ఆస్పత్రులకు సప్లై చేస్తోంది.

అటు మార్కెట్‌లో కూడా వైట్ మస్లీకి చాలా డిమాండ్ ఉండడంతో ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా అమ్ముతున్నారు. దాంగ్ ఫారెస్ట్ విభాగం ఈ తరహా వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తూ రైతులకు విత్తనాలు సప్లై చేసి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది. దాంగ్‌ జిల్లాలో మొత్తం 350 మంది రైతులు ఈ సాగు చేపట్టగా మొత్తం 40 ఎకరాల్లో ప్రస్తుతం పంట సాగవుతోంది. ప్రస్తుతం కేజీ వైట్ మస్లీ ధర రూ.1000 నుండి రూ.1500 ధర పలుకుతుండగా ప్రభుత్వ పథకాలను పొందడంతో సాగు ఖర్చు చాలా స్వల్పంగానే ఉంటుంది.