Telangana : బీజేపీది పాక్, ఫేక్, బ్రేక్ సిద్ధాంతం..పాకిస్థాన్ పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు అడుక్కోవడం ఫ్యాషన్ గా మారింది

బీజేపీది పాక్, ఫేక్, బ్రేక్ సిద్ధాంతంతో ముందుకెళుతోంది అనీ..పాకిస్థాన్ పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు అడుక్కోవడం బీజేపీకి ఫ్యాషన్ గా మారిందని టీార్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సెటైర్లు వేశారు.

Telangana : బీజేపీది పాక్, ఫేక్, బ్రేక్ సిద్ధాంతం..పాకిస్థాన్ పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు అడుక్కోవడం ఫ్యాషన్ గా మారింది

Trs Mla Danam Nagender Criticizes Bjp Government

TRS MLA Danam Nagender criticizes BJP government : మాజీ మంత్రి, TRS ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రధాని మోడీపైనా బీజేపీపైనా విమర్శలు సంధించారు. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన దురదృష్టకరం అని అన్న దానం తనదైనశైలిలో బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. మోడీ ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తొందరపడి తీసుకొచ్చిందని అన్నారు. ప్రధాని మోడీకి అసలు ఓ సిద్ధాంతం అంటూ లేకుండా పోయింది..‘బీజేపీ పాక్, ఫేక్, బ్రేక్’ సిద్ధాంతం తో ముందుకు వెళుతోందంటూ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు అడుక్కోవడం బీజేపీకి ఫ్యాషన్ గా మారిందని..ఫేక్ మాటలతో సోషల్ మీడియా లో పబ్బం గడుపుకుంటోందని వివర్శించారు. బీజేపీప కుల మతాల మధ్య చిచ్చు పెట్టి బ్రేక్ రాజకీయాలు చేస్తోందని..గత కొన్నేళ్లుగా సైన్యంలో నియామకాలు చేయకుండా అగ్ని పథ్ తేవడం నిరసనలకు కారణంగా మారిందని అనాలోచిత నిర్ణయాలతో బీజేపీ యువత సహనానికి పరీక్ష పెట్టిందని విమర్శించారు. తెలంగాణాలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది అని అన్న దానం బండి సంజయ్ నరం లేని నాలుకను ఎటైనా తిప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ ఇష్టానుసారంగా అవాస్తవాలు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని…ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి ననే విషయం మరచి పోయి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం రాష్ట్ర పాలకులమీదే ఉంటుంది పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని..సికింద్రాబాద్ విధ్వంస ఘటన కుట్రపూర్వకంగానే జరిగింది అని కిషన్ రెడ్డి..బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని దానం నాగేందర్ అన్నారు.

తెలంగాణ లో ఓ చిన్న హింసాత్మక ఘటన ఇన్ని రోజులుగా జరగ లేదని..శాంతి భద్రతలకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని..ఎవరైనా తమ కొంపను తామే కాల్చుకుంటారా
? అని ప్రశ్నించిన దానం నిరాధారంగా ..బండి, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. యువతలో ఆక్రోశం పెరగడానికి బీజేపీ విధానాలే కారణమని ఆరోపించారు. .బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంత కన్నా హింస జరిగింది.. అక్కడ హింసకు అక్కడి ప్రభుత్వాలే కారణం అంటారా? దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మోడీ తీసుకొచ్చిన ఏ పథకం కూడా ఇప్పటివరకు విజయవంతం అయిన పాపానపోలేదని..పథకాలను ప్రకటించడం ఆ తర్వాత దాని గురించి మరచిపోవడం మోడీ కి అలవాటేనంటూ దెప్పిపొడిచారు. పొరపాటు జరిగితే నెపాన్ని ఇతరుల పైకి నెట్టడం బీజేపీ నైజంగా మారిందని అన్నారు. అగ్నిపథ్ స్కీం ను తక్షణమే విరమించుకోవాలని..నోట్ల రద్దు, వ్యవసాయ చట్టాలు, నిన్నటి అగ్ని పథ్ అన్నీ మోడీ వైఫల్యాలే
..యువత ను పొట్టన బెట్టుకున్నందుకు బీజేపీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే శుక్రవారం (17,2022)ఆర్మీ ట్రైనింగ్ పొందుతు అగ్నిపథ్ ఆందోళనల్లో మృతి చెందిన వరంగల్ కు చెందిన రాకేష్ మరణించడంపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారని..మృతుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కేసీఆర్ ప్రకటించారని..మృతుడి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని దానం వెల్లడించారు. అగ్ని పథ్ పరిణామాలు చర్చించేందుకు కేంద్రం వెంటనే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలన్నారు.

ఈ రోజు మోడీ తల్లి హీరాబెన్ వందో పుట్టిన రోజు ..తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా నైనా మోడీ ఎవరికీ పుత్ర శోకం ఉండకుండా చూసుకుంటే మంచిదని దానం సూచించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు బట్టగాల్చి మీదేయడం అలవాటుగా మారిందని …శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు బీజేపీ నేతలకు అలవాటని అన్నారు. వరంగల్ యువకుడు రాకేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్షా కు చెప్పరా? అని ప్రశ్నించారు.