Vaccination: జూన్ 21నుంచి నాలుగో దశ వ్యాక్సినేషన్.. మరో మైలురాయి దాటిన భారత్!

జూన్ 21వ తేదీ నుంచి నాలుగో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయడానికి ప్రభుత్వం పూర్తి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 75 శాతం డోసులను కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తుంది.

Vaccination: జూన్ 21నుంచి నాలుగో దశ వ్యాక్సినేషన్.. మరో మైలురాయి దాటిన భారత్!

Union Govt Exerted Its Strength To Make The Fourth Phase Of Coronavirus Vaccination

Coronavirus Vaccination Drive: జూన్ 21వ తేదీ నుంచి నాలుగో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయడానికి ప్రభుత్వం పూర్తి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 75 శాతం డోసులను కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తుంది. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ లభ్యతలో గుణాత్మక పెరుగుదల ఉండబోతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతుంది.

దేశవ్యాప్తంగా గత ఐదు నెలల్లో అందించిన వ్యాక్సిన్‌కు రెట్టింపు మోతాదులను రాబోయే 49 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. స్పష్టంగా, వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను కూడా అందుకు అనుగుణంగా పెంచాల్సి ఉంటుంది. అదే సమయంలో టీకాలను వ్యాక్సిన్ కేంద్రాలకు అందించడానికి కోల్డ్ చైన్ నుంచి సిబ్బందికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది కేంద్రం.

వ్యాక్సిన్ జనాభాతో పాటు మారుమూల ప్రాంతాలకు చేరేలా చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు చెప్పింది. ఇదిలా ఉంటే, కరోనాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని సాధించింది. వ్యాక్సిన్ డ్రైవ్‌ 148వ రోజుకు చేరగా.. రెండున్నర కోట్ల(25,28,78,702)కు పైగా డోసులు పంపిణీ చేసింది. ఈ క్రమంలోనే రెండు కోట్ల(20,46,01,176) మొదటి టీకా డోసులను వేసి చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది.

శనివారం(12 జూన్ 2021) ఒకేరోజు మొత్తం 31లక్షల 67వేల 961 డోసులను వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో తొలి డోసు 28,11,307 మంది లబ్ధిదారులకు వేయగా, మరో 3,56,654 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు అందజేసింది. 18నుంచి 44 ఏజ్‌ గ్రూప్‌లో 18,45,201 మంది లబ్ధిదారులకు మొదటి మోతాదు వేయగా.. 1,12,633 మంది లబ్ధిదారులకు సెకండ్‌ డోస్‌ వేశారు.

రాబోయే రోజుల్లో టీకా లభ్యత డేటాను గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్ బయోటెక్ మరియు సీరం ఇన్స్‌స్టిట్యూట్ జూన్‌లో 120 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, గత 11 రోజుల్లో కేవలం మూడు కోట్ల మోతాదులను మాత్రమే సరఫరా చేసింది. రోజుకు 30 లక్షల మోతాదుల చొప్పున 3.33 కోట్ల మోతాదులను అందించారు.

ఇప్పుడు జూన్ మిగిలిన 19 రోజుల్లో, తొమ్మిది కోట్ల మోతాదులను సరఫరా చేయాల్సి ఉంది, ఈ కారణంగా రోజుకు సగటున 48 లక్షల మోతాదులను ఇవ్వవచ్చు. అదే సమయంలో జూలైలో సుమారు 20 కోట్ల మోతాదులను సరఫరా చేయనున్నారు. దీనితో రోజుకు సగటున 65 లక్షల టీకాలు వేయవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ప్రకారం, రోజువారీ టీకాల సంఖ్య జూలై రెండవ పక్షం నుండి కోటి దాటవచ్చు. ఇది ఆగస్టు నుండి మరింత పెరుగుతుంది.