Union Minister Kishan Reddy : రేపటి నుంచి కిషన్‌రెడ్డి జనఆశీర్వాదయాత్ర

కేంద్రంలో బీజేపీ  7 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేంద్ర సాంస్కృతి

Union Minister Kishan Reddy : రేపటి నుంచి కిషన్‌రెడ్డి జనఆశీర్వాదయాత్ర

Jana Aseerwada Yatra

Union Minister Kishan Reddy : కేంద్రంలో బీజేపీ  7 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి రేపటి నుంచి 3 రోజుల పాటు ఉభయతెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్రకు జన ఆశీర్వాదయాత్ర గా నామ కరణం చేశారు. ఆగస్ట్ 18వ తేదీ సాయంత్రం 4-30 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానాకి చేరుకునే కిషన్ రెడ్డి, సాయంత్రం బీజేపీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గోంటారు. రాత్రికి తిరుమల చేరుకుని బస చేస్తారు.

రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి చేరుకుని వ్యాక్సిన్ సెంటర్ ను ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం11 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్నశ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకుని, పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గోంటారు. అనంతరం జన ఆశీర్వాదయాత్రకు శ్రీకారం చుట్డతారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్డు మార్గంలో పర్యటిస్తూ  రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణలోని కోదాడ తిరుమలపూర్ గ్రామం చేరుకుంటారు.

20న దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా వరంగల్‌లోకి ప్రవేశిస్తారు. అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని వరంగల్‌, హన్మకొండలో తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. వరంగల్‌లో టీకా కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత సర్వాయి పాపన్న గ్రామమైన ఖిలాషాపూర్‌.. అక్కడి నుంచి జనగామ, ఆలేరుకు చేరుకుంటారు. ఆలేరులో చేనేత కార్మికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశంని కలుస్తారు. అనంతరం యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. ఆ రాత్రి యాదాద్రిలోనే బస చేస్తారు.

ఈనెల 21న ఉదయం భువనగిరిలో రేషన్‌ దుకాణంలో బియ్యం పంపిణీని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఘట్‌కేసర్‌, ఉప్పల్‌ మీదుగా నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.  3 రోజులపాటు 384 కిలోమీటర్లు సాగే  ఈ జన ఆశీర్వాద యాత్ర …. 12 జిల్లాలు, 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 పార్లమెంటు నియోజకవర్గాల గుండా సాగుతుంది. జన ఆశీర్వాద యాత్ర సాగే మార్గంలో 40 చోట్ల బీజేపీ శ్రేణులు బహిరంగ సభలు ఏర్పాటు చేశాయి. యాత్ర పొడవునా బీజేపీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను కిషన్ రెడ్డి వివరిస్తూ ముందుకు సాగుతారు.

కిషన్ రెడ్డి చేపట్టనున్న జన ఆశీర్వాద యాత్రకు ఇంచార్జ్ గా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిని నియమించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. యాత్ర ఆద్యంతం.. సభలు, సమావేశాలు తదితర వివరాలన్నీ ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు.ఈ యాత్రలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారని పార్టీ పేర్కోంది.