Kalyan Singh : విష‌మంగా యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌ ఆరోగ్యం

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న కల్యాణ్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా మారింది. దీంతో డాక్టర్లు ఆయ‌న్ని వెంటిలేషన్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నారు.

Kalyan Singh : విష‌మంగా యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌ ఆరోగ్యం

Up Ex Cm Kalyan Singh

up Former CM Kalyan Singh condition critical : ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న కల్యాణ్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా మారింది. దీంతో డాక్టర్లు ఆయ‌న్ని వెంటిలేషన్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నారు. 89 సంవత్సరాల కల్యాణ్ సింగ్ నిన్న సాయంత్రం నుంచి లైఫ్‌ సేవింగ్ సపోర్ట్‌పై ఉంచారు డాక్టర్లు. సీనియర్ డాక్టర్ల బృందం ఆరోగ్య ప‌రిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తోంది. క‌ల్యాణ్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ..ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ..చికిత్స చేస్తున్నా స్థిరంగా ఉండటంలేదని తెలిపారు.

కాగా..యూపీ మాజీ సీఎం క‌ల్యాణ్ సింగ్ ల‌క్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ఆసుప‌త్రిలో జులై 4 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవ‌లే ఆసుప‌త్రికి వెళ్లిన ప‌లువురు నేత‌లు ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. క‌ల్యాణ్ సింగ్‌కు హృద్రోగ‌, న‌రాల వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందిస్తున్నారు.చికిత్స పొందుతున్న కల్యాణ్ సింగ్ ను యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్తితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

5 జనవరి 1932 కళ్యాణ్ సింగ్ బీజేపీ నేత. రాజస్థాన్ మాజీ గవర్నర్,ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎంగా పనిచేశారు. కళ్యాణ్ సింగ్ తేజపాల్ సింగ్ లోధి ,సీతలకు జన్మించిన కల్యాణ్ సింగ్ బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. యూపీ సీఎంగా రెండు సార్లు, జనసంఘ్, జనతా పార్టీ ,భారతీయ జనతా పార్టీలకు అట్రౌలీకి ఎమ్మెల్యేగా అనేక పదవుల్లో పనిచేశారు. 26 ఆగస్టు 2014 న రాజస్థాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

కల్యాణ్ సింగ్ మొదటిసారి జూన్ 1991 లో యూపీ సీఎం అయ్యారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆయన కీలక పాత్ర వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం..సీఎం అయిన వెంటనే ఆయన తన సహచరులతో కలిసి ” అయోధ్యను సందర్శించి అక్కడే రామ్ ఆలయాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇలా బీజేపీలో కల్యాణ్ సింగ్ పాత్ర ఉంది.